ఎలక్ట్రిసిటీ,PGCIL: విద్యుత్‌ సంస్థ పవర్‌ గ్రిడ్‌లో ఉద్యోగాలు.. రూ.లక్ష వరకు జీతం – power grid corporation of india pgcil recruitment 2025 for 28 field supervisor jobs

Date:

- Advertisement -


Electricity Department : పవర్‌ గ్రిడ్ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. పూర్తి వివరాలను పరిశీలిస్తే..

హైలైట్:

  • పవర్‌ గ్రిడ్‌ జాబ్‌ రిక్రూట్‌మెంట్‌ 2025
  • 28 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల
  • మార్చి 25 దరఖాస్తులకు చివరితేది
Samayam Teluguపీజీసీఐఎల్‌ రిక్రూట్‌మెంట్‌
పీజీసీఐఎల్‌ రిక్రూట్‌మెంట్‌

PGCIL Recruitment 2025 : మహారాష్ట్రలోని పవర్‌ గ్రిడ్ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (Power Grid) ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న 28 ఫీల్డ్‌ సూపర్‌వైజర్‌ పోస్టులు (అన్‌ రిజర్వ్‌డ్-13, ఓబీసీ-7, ఎస్సీ-4, ఎస్టీ-2, ఈడబ్ల్యూఎస్‌-2, ఎక్స్‌సర్వీస్‌ మెన్‌-3) భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో అప్లయ్‌ చేసుకోవచ్చు. మార్చి 25వ తేదీ వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు. అభ్యర్థులు పూర్తి వివరాలకు నోటిఫికేషన్‌ చూడొచ్చు. అలాగే అప్లయ్‌ చేసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్‌ చూడొచ్చు. అప్లయ్‌ చేసుకోవడానికి డైరెక్ట్‌ లింక్‌ ఇదే.

ఇతర ముఖ్య సమాచారం :

  • ఫీల్డ్‌ సూపర్ వైజర్‌ పోస్టులు : 28
  • అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా (ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్‌, పవర్‌ సిస్టం ఇంజినీరింగ్‌, పవర్‌ ఇంజినీరింగ్‌, సివిల్, మెకానికల్, ఫైర్‌ టెక్నాలజీ అండ్‌ సేఫ్టీ)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
  • వయోపరిమితి: 2025 మార్చి 25వ తేదీ నాటికి 29 ఏళ్లు ఉండాలి.
  • జీతం: నెలకు రూ.23,000 నుంచి రూ.1,05,000 వరకు వేతనం ఉంటుంది.
  • దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ విధానంలో అప్లయ్‌ చేసుకోవచ్చు.
  • దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.300 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
  • ఎంపిక విధానం: స్క్రీనింగ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
  • దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 25, 2025

India Post : రాతపరీక్ష లేకుండా IPPB బ్యాంక్‌లో ఎగ్జిక్యూటివ్‌ జాబ్స్‌

India Post Payment Bank Recruitment 2025 : ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల రిక్రూట్‌మెంట్ కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించింది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ 51 పోస్టులను భర్తీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://www.ippbonline.com/ చూడటం ద్వారా ఈ పోస్ట్‌లకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేయడానికి 2025 మార్చి 21 చివరి తేదీగా నిర్ణయించారు. నోటిఫికేషన్‌ ప్రకారం.. గ్రాడ్యుయేషన్‌లో పొందిన మార్కుల శాతం ఆధారంగా మెరిట్ జాబితా ఎంపిక చేస్తారు. ఆపై ఇంటర్వ్యూ ఉంటుంది. పూర్తి వివరాలకు డైరెక్ట్‌ లింక్‌ ఇదే.

కిషోర్‌ రెడ్డి

రచయిత గురించికిషోర్‌ రెడ్డికిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు.
రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు.
కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.
… ఇంకా చదవండి



Source link

- Advertisement -

Top Selling Gadgets

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − ten =

Share post:

Subscribe

Popular

More like this
Related

Apple Launches ‘Surveyor’ App for Apple Maps Data Collection

Apple today launched a new app called Surveyor,...

குரூப் தோ்வு எழுதுவோா் கவனத்துக்கு

தமிழ்நாடு அரசுப் பணியாளா் தோ்வாணையத்தால் குரூப் 1, குரூப்...

Apple’s Smart Home Hub Tipped to Adopt iOS 19-Style UI; Launch Delayed to Post WWDC 2025

Apple has long been rumoured to be developing...

Top Selling Gadgets