నా రియల్‌ లైఫ్‌ హీరోలు వీళ్లే! | Naga Chaitanya and Sai Pallavi Thandel Pre Release Event

Date:

- Advertisement -


Naga Chaitanya and Sai Pallavi Thandel Pre Release Event

∙బన్నీ వాసు, నాగచైతన్య, అల్లు అరవింద్, సందీప్‌ రెడ్డి, దేవిశ్రీ ప్రసాద్, సాయిపల్లవి, చందు మొండేటి

హీరో నాగచైతన్య

‘‘ఒక యాక్టర్‌కి ఒక లిస్ట్‌ ఉంటుంది.. ఫలానా డైరెక్టర్‌తో చేస్తే కెరీర్‌కి ఉపయోగపడుతుందని. కానీ నా లిస్ట్‌లో గీతా ఆర్ట్స్‌ పేరు టాప్‌లో ఉంటుంది. ఈ బేనర్‌లో సినిమా చేసిన ఏ యాక్టర్‌ అయినా ఒక మంచి రిజల్ట్‌తో బయటికొస్తారు’’ అని హీరో నాగచైతన్య అన్నారు. నాగచైతన్య(Naga Chaitanya), సాయిపల్లవి(Sai Pallavi) జంటగా నటించిన తాజా చిత్రం ‘తండేల్‌’(Thandel). 2018లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకత్వం వహించారు.

అల్లు అరవింద్‌ సమర్పణలో గీతా ఆర్ట్స్‌ పతాకంపై బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘తండేల్‌ జాతర’ అంటూ  యూనిట్‌ ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌(Pre Release Event)లో నాగచైతన్య మాట్లాడుతూ– ‘‘ఈ వేడుకకు వచ్చినందుకు సందీప్‌ రెడ్డిగారికి ధన్యవాదాలు. ఈ మధ్యకాలంలో మీలా నిజాయతీ ఉన్న వ్యక్తిని చూడలేదు. మీ సినిమాలే కాదు… మీ ఇంటర్వ్యూల్లో ఓ నిజాయితీ కనిపిస్తుంది. ఇక నా రియల్‌ లైఫ్‌కి, తండేల్‌ రాజు క్యారెక్టర్‌కి చాలా తేడా ఉంటుంది. నేను రాజుగా ట్రాన్స్‌ఫార్మ్‌ కావడానికి టైమ్‌ ఇచ్చారు. చందు నన్ను నమ్మాడు. చందూతో నాకిది మూడో సినిమా. ప్రతి సినిమాకి నన్ను కొత్తగా చూపిస్తాడు. దేవిశ్రీ ప్రసాద్‌ ట్రూ రాక్‌స్టార్‌. ‘నమో నమః శివాయ…’ పాట రిహార్శల్స్‌ జరుగుతున్నపుడు దేవి సెట్‌కి వచ్చి ఎంతో ఎనర్జీ ఇచ్చాడు. కెమేరామేన్  శ్యామ్‌ సార్, ఇతర యూనిట్‌ అందరికీ థ్యాంక్స్‌. శ్రీకాకుళం నుంచి వచ్చిన మత్స్యకారులందరూ వేదిక మీదకు రావాలి.

వీళ్లు లేకుండా ఈ తండేల్‌ రాజు క్యారెక్టరే లేదు. చందు నాకు ఈ కథను ఓ ఐడియాలా చెప్పాడు. చాలా ఎగ్జయిట్‌ అయ్యాను. ఆ తర్వాత మచ్చలేశంకి తీసుకెళ్లాడు. అక్కడ వీళ్లందర్నీ కలిశాను. అక్కడి మట్టి వాసన, వాళ్ల లైఫ్‌ స్టయిల్, ఎదుర్కొన్న సవాళ్లు, అనుభవాలు, తీసుకునే ఆహారం అన్నీ తెలుసుకున్నాను. అప్పుడు తండేల్‌ రాజు పాత్ర ఎలా చేయాలో ఐడియా వచ్చింది. పాకిస్తాన్ లో సంవత్సరం పైన జైల్లో ఎన్నో సవాళ్లు ఎదుర్కొని వచ్చారు కదా… మళ్లీ ఎందుకు వేటకి వెళుతున్నారని వీళ్లని అడిగితే… ‘మాకు ఇదే వచ్చు. సముద్రం తప్ప వేరే తెలియదు’ అన్నారు. వాళ్ల ఆడవాళ్లల్లో భయం కనిపించింది. ఇది నిజమైన హ్యూమన్  ఎమోషన్ . వీళ్లే నా రియల్‌ లైఫ్‌ హీరోలు. వ్యక్తులుగా వీళ్లు నన్ను ఎంతో ఇన్ స్పైర్‌ చేశారు. ఈ సినిమా చూసి మీరంతా సంతోషపడతారని అనుకుంటున్నాను’’ అని అన్నారు.

‘‘ట్రైలర్, టీజర్, సాంగ్స్‌… ఏది చూసినా సినిమాలో మంచి ఎమోషనల్‌ కనెక్ట్‌ కనిపిస్తోంది. నాగచైతన్య – సాయిపల్లవి స్క్రీన్‌పై రియల్‌ పీపుల్‌లా కనిపిస్తున్నారు. ఇలా ఆర్టిస్టులు కనిపించిన సినిమాలన్నీ హిట్స్‌గా నిలిచాయి. ‘అర్జున్  రెడ్డి’ సినిమా కోసం హీరోయిన్ గా సాయిపల్లవిని సంప్రదించాలని కో ఆర్డినేటర్‌తో మాట్లాడాను. ఆమె స్లీవ్‌లెస్‌ డ్రెస్‌లు ధరించరని చెప్పారు. భవిష్యత్‌లో అలానే ఉంటారా? అనిపించింది. ఆమె ఇప్పటికీ అలానే ఉన్నారు’’ అన్నారు ముఖ్య అతిథిగా పాల్గొన్న దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా. 

‘‘నాగచైతన్య, సాయిపల్లవి, అరవింద్‌గారు, చందు… ఇలాంటి టీమ్‌ అంతా కష్టపడి చేసిన మూవీ తప్పకుండా హిట్‌ అవుతుంది’’ అన్నారు మరో ముఖ్య అతిథిగా పాల్గొన్న నిర్మాత ‘దిల్‌’ రాజు. ‘‘ఈ సినిమా సక్సెస్‌మీట్‌లో మాట్లాడతాను’’ అన్నారు చందు మొండేటి.

సాయిపల్లవి మాట్లాడుతూ– ‘‘తండేల్‌ రాజుగా నాగచైతన్యగారు మారిన తీరు స్ఫూర్తిదాయకం. చందూగారికి ఫుల్‌ క్లారిటీ ఉంటుంది. దర్శకుడు సందీప్‌గారు ఎవరితో మాట్లాడారో నాకు తెలియదు. ‘అర్జున్ రెడ్డి’ మూవీలో షాలినీ బాగా యాక్ట్‌ చేశారు. ఎవరు చేయాల్సిన మూవీ వారికే వెళ్తుంటుంది. 

‘తండేల్‌’  వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందింది. ఈ ఘటనలో భాగమైన మహిళలందరూ ధైర్యవంతులు’’ అన్నారు.దేవిశ్రీ ప్రసాద్‌ మాట్లాడుతూ– ‘‘నాగార్జునగారి ‘ఢమరుకం’ కోసం శివుడు పాట చేశాను. ఇప్పుడు చైతూ కోసం శివుడి పాట చేశాను. తండ్రీకొడుకులతో శివుడి పాట చేయడం సంతోషంగా ఉంది’’ అని చెప్పారు. ‘‘రాజు–సత్యల మధ్య జరిగే కథ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కార్తీక్‌ రాసిన మంచి కథకు చందు మంచి స్క్రీన్ ప్లే ఇచ్చారు’’ అన్నారు బన్నీ వాసు. 

2018లో శ్రీకాకుళం నుంచి గుజరాత్‌కు వలస వెళ్లిన మత్స్యకారులు పొరపాటున పాకిస్తాన్  బోర్డర్‌ క్రాస్‌ చేసి, అక్కడి కోస్టుగార్డులకు బందీలుగా చిక్కారు. ఈ ఘటన ఆధారంగా ‘తండేల్‌’ తీశారు. ఈ ఘటనలో నిజంగా భాగమైన వారిలో తండేల్‌ రామారావు, రాజు, కిశోర్‌ తదితరులు ఈ వేడుకలో పాల్గొని, వారి అనుభవాలను పంచుకున్నారు.

‘‘ఈ సినిమా సక్సెస్‌మీట్‌లో మాట్లాడతాను. ఇక ఈ ఈవెంట్‌కు బన్నీ (అల్లు అర్జున్‌) వస్తారని అనుకున్నాం. కానీ ఫారిన్  నుంచి వచ్చాడు.  గ్యాస్ట్రైటిస్‌ ప్రాబ్లమ్‌తో రాలేక΄ోయాడు’’ అని తెలిపారు అల్లు అరవింద్‌.



Source link

- Advertisement -

Top Selling Gadgets

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + one =

Share post:

Subscribe

Popular

More like this
Related

Access Denied

Access Denied You don't have permission to access...

Xbox Will Bring Age of Mythology: Retold, Age of Empires II: Definitive Edition to PS5 This Year

Two more Microsoft first-party games are coming to...

Top Selling Gadgets