పోలీసు కస్టడీకి వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి…50కి పైగా కేసులు

Date:

- Advertisement -


varra ravinder reddy

వర్రా రవీందర్ రెడ్డి

Photo : Twitter

వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డిని పోలీసులు రెండు రోజుల కస్టడీకి తీసుకున్నారు. ఈ క్రమంలో కడప సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో పులివెందుల పోలీసులు విచారిస్తున్నారు. న్యాయవాది సమక్షంలో వర్రా రవీందర్ రెడ్డిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. వర్రా రవీందర్ రెడ్డిపై జిల్లాలో 10, రాష్ట్ర వ్యాప్తంగా 40 కేసులు నమోదు అయిన సంగతి తెలిసిందే. వర్రా రవీందర్ రెడ్డిపై అటు మాజీమంత్రి వైఎస్ సునీతారెడ్డి సైత పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వర్రా రవీందర్ రెడ్డిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అలాగే ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, నారా లోకేశ్, వైఎస్ షర్మిల, వైఎస్ విజయమ్మ, హోంశాఖ మంత్రి వంగలపూడి అనితలపై సోషల్ మీడియా వేదికగా అసభ్యకరమైన పోస్టులు పెట్టిన సంగతి తెలిసిందే.

వర్రాపై వైఎస్ సునీత ఫిర్యాదు

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతా రెడ్డి ఫిర్యాదుపై సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు చర్యలు తీసుకున్నారు. తనపై ఫేస్‌బుక్‌లో బెదిరింపుకలకు పాల్పడుతున్నారని.. తనకు ప్రాణహాని ఉందని సునీతా రెడ్డి ఇటీవల సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. సునీతా రెడ్డి ఫిర్యాదుకు సంబంధించి సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు.. వర్రా రవీంద్ర రెడ్డిపై కేసు నమోదు చేశారు. సైబర్ క్రైమ్స్ పోలీసులు దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్ ప్రకారం.. నిందితుడు రవీంద్రరెడ్డిపై ఐటి చట్టంలోని సెక్షన్ 67తో పాటు ఐపీసీ సెక్షన్ 506 (క్రిమినల్ బెదిరింపు), సెక్షన్ 509 (మహిళలను అవమానించడం) కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక, సునీతా రెడ్డి తన ఫిర్యాదులో.. వర్రా రవీంద్రరెడ్డి తనపై, వైఎస్ షర్మిలపై, వైఎస్ విజయమ్మపై అసభ్య పదజాలంతో ప్రతిష్టకు భంగం కలిగించేలా పోస్టులు పెడుతున్నారని పేర్కొన్నారు.

షర్మిల..విజయమ్మపై అసభ్యకర పోస్టులు

‘నా కుటుంబం రాజకీయాల్లో ఉన్నప్పటికీ.. నేను చాలా ప్రైవేట్ లైఫ్ గడుపుతున్నాను. గత కొద్ది రోజులుగా వర్రా రవీంద్రారెడ్డి ఫేస్‌బుక్‌లో నాపై, నా సోదరి వైఎస్‌ షర్మిలపై, పెద్దమ్మ వైఎస్‌ విజయమ్మపై తీవ్ర అభ్యంతరకర పోస్టులు పెడుతున్నారు. జనవరి 29న నా సోదరి షర్మిలతో పాటు నేను ఇడుపులపాయ వెళ్లాను. అనంతరం వర్రా రవీందర్ రెడ్డి తన పేజీలో శత్రువులను ఒంటరిగా వదిలిపెట్టకూడదని పెద్దలు చెప్పారు… వారిని చంపండి.. అది ఈ ఎన్నికలకు ఉపయోగపడుతుంది.. అని మమ్మల్ని ఉద్దేశించి పోస్టు పెట్టాడు. నేను ఇప్పటికే నా తండ్రి హత్య కేసుపై కోర్టులో పోరాడుతున్నాను. గతంలో ఇలాంటి బెదిరింపులే రాగా.. పోలీసులకు, సీబీఐ అధికారుల దృష్టికి తీసుకెళ్లాను. మొత్తం ఫేస్‌బుక్ పేజీలో షర్మిల, ఆమె తల్లి విజయమ్మ, మరికొందరిపై అవమానకరమైన పోస్టులు ఉన్నాయి. అతను నాకు, షర్మిలకు వ్యతిరేకంగా అనేక ఇతర అత్యంత అసభ్యకరమైన, నీచమైన పోస్ట్‌లను పోస్ట్ చేస్తున్నాడు. అతని పోస్ట్‌లు నాపై, షర్మిలపై నీచమైన చర్యలకు ఇతరులను ప్రేరేపించే దూషణలతో నిండి ఉన్నాయి. విజయమ్మను క్యారెక్టర్‌ను కించపరిచే స్థాయికి వెళ్లాడు’అని సునీత తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఖండించిన రాహుల్ గాంధీ

ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో షర్మిల, సునీతలపై బెదిరింపులను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఖండించారు. మహిళలను అవమానించడం, బెదిరించడం.. నీచమైన, పిరికి చర్య అని రాహుల్ మండిపడ్డారు. ఇది దురదృష్టవశాత్తు బలహీనుల అత్యంత సాధారణ ఆయుధంగా మారిందని అన్నారు. వైఎస్ షర్మిల, సునీతపై జరుగుతున్న అవమానకర దాడిని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తోందని చెప్పారు. ఇద్దరికి పార్టీతో పాటు, తన మద్దతు కూడా ఉంటుందని రాహుల్ గాంధీ ఎక్స్‌లో పోస్టు చేశారు.

ఇకపోతే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో అప్పటి విపక్ష పార్టీలు, నాయకులపై వర్రా రవీందర్ రెడ్డి సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే వైసీపీ ఓటమి తర్వాత కూడా అతడు సోషల్ మీడియాలో కూటమి ప్రభుత్వం టార్గెట్‌గా అసభ్యకరమైన పోస్టులు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

సీఎం చంద్రబాబు..పవన్ కల్యాణ్‌పైనా అసభ్యకర పోస్టులు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేశ్, అనితలపై పలు సందర్భాల్లో అసభ్యకరమైన పోస్టులు పెట్టిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు చేస్తున్నారనే ఫిర్యాదులతో వర్రా రవీందర్ రెడ్డి‌పై ఇప్పటికే వివిధ పోలీసు స్టేషన్‌లలో కేసులు కూడా నమోదయ్యాయి.





Source link

- Advertisement -

Top Selling Gadgets

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × four =

Share post:

Subscribe

Popular

More like this
Related

Top Selling Gadgets