Telangana Formation Day Speech In Telugu,Telangana Formation Day: అమరుల త్యాగాలమయం.. తెలంగాణ అవతరణం.. – the history of telangana from nizam rule to youngest state of india

Date:

- Advertisement -


తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ పోరాట ఫలితంగా 2014 జూన్ 2న రాష్ట్రం ఆవిర్భవించింది. నిజాం పాలన నుండి విముక్తి కోసం ఎందరో పోరాడారు. 1969 ఉద్యమం, మలిదశ ఉద్యమం తెలంగాణ ఆకాంక్షను బలంగా వినిపించాయి. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ కలను నిజం చేసింది. ప్రస్తుతం తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిస్తూ, ప్రజలకు సంక్షేమ పాలన అందిస్తోంది. అమరుల త్యాగాలను స్మరించుకుంటూ రాష్ట్రాన్ని సుసంపన్నం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా స్పెషల్ స్టోరీ మీకోసం.

వీరుల ప్రాణ ఫలం.. తెలంగాణ అవతరణం..
వీరుల ప్రాణ ఫలం.. తెలంగాణ అవతరణం.. (ఫోటోలు– Samayam Telugu)
పొద్దుపొడుపును చూసిన తెలంగాణ బిడ్డలు, ఆనాటి చీకట్లను చీల్చుకుంటూ బయటికొచ్చిన రోజు అది. జూన్ 2, 2014.. ఆ మాట తలుచుకుంటేనే తెలంగాణ ప్రజల గుండె ఉప్పొంగుతుంది. ఇది ఒక దినోత్సవం కాదు.. వందల మంది వీరుల నెత్తురుతో, వేల మంది త్యాగాలతో, లక్షల మంది పోరాటాలతో పుట్టిన పండుగ. ఇది కథ కాదు.. తరతరాల ఆవేదన, ఆత్మగౌరవ పోరాటగాథ.

నిజాం దాస్యం నుంచి విముక్తి..

మన తెలంగాణ చరిత్ర నిజాం రాజుల కాలం నుంచే నెత్తురుతో తడిసిపోయింది. తెలుగు భాష, యాస, సంస్కృతి అణచివేయబడ్డాయి. జాతీయతకు దెబ్బ తగిలింది. అయితే, దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా, నిజాం కింద ఉన్న మన ప్రాంతానికి మాత్రం వెంటనే విముక్తి లభించలేదు. అప్పుడు మొదలైంది రజాకార్ల దౌర్జన్యం. ‘మాకొద్దు ఈ నిజాం రాజ్యం’ అని గర్జించారు మన సాయుధ రైతాంగ యోధులు. కొమురం భీమ్ ’జల్, జంగల్, జమీన్’ అంటూ చేసిన నినాదం ఆత్మాభిమానానికి ప్రతీకగా నిలిచింది. రజాకార్ల దురాగతాలకు అడ్డుకట్ట వేస్తూ.. ప్రాణాలకు తెగించి పోరాడారు. ఆ తర్వాత 1948 సెప్టెంబర్ 17న పోలీస్ చర్యతో నిజాం పరిపాలన అంతమై, తెలంగాణ భారత యూనియన్‌లో విలీనమైంది. అప్పటికి మనది ప్రత్యేక అస్తిత్వం, ఒక సొంత సంస్కృతి.అయితే.. ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. 1956లో భాషాప్రయుక్త రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా.. ‘పెద్ద మనుషుల ఒప్పందం’ పేరుతో తెలంగాణను ఆంధ్ర రాష్ట్రంలో కలిపారు. అప్పుడు అన్నేసి హామీలు ఇచ్చినా.. అమలు మాత్రం జరగలేదు. మన వనరులు, ఉద్యోగాలు, నిధులు అన్నీ ఆంధ్రాపాలకుల కన్ను గప్పి పోయాయి. మన యాస, భాష, సంస్కృతికి విలువ లేకుండా పోయింది. మన పండుగలు, ఆచారాలు కూడా చిన్నచూపు చూశారు. ఈ వివక్ష, అణచివేతతోనే తెలంగాణ బిడ్డల గుండెల్లో మళ్లీ ఆవేదన రాజుకుంది. ’మన బతుకులు ఎందుకు ఇట్లైనయ్?’ అని లోలోపల కుమిలిపోయారు.

1969 ఉద్యమం .. తొలి రక్తతర్పణం, చెరగని గాయాలు..

ఆ ఆవేదనే 1969లో ఒక మహోద్యమంగా మారింది. “జై తెలంగాణ” నినాదాలు మిన్నంటాయి. ముఖ్యంగా విద్యార్థులు ముందుకొచ్చారు. ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణం ఉద్యమానికి ఊపిరి పోసింది. ఉద్యోగాలు, నిధులు, నీళ్లు.. మనకే కావాలని డిమాండ్ చేశారు. కానీ ఆ ఉద్యమాన్ని నిర్దాక్షిణ్యంగా అణచివేశారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో ఎందరో యువకులు, వందల మంది అమాయక విద్యార్థులు పోలీసు తూటాలకు బలయ్యారు. వారి రక్తం తెలంగాణ నేలను తడిపి, ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షకు బలంగా నిలిచింది. ఆ త్యాగాలు చరిత్రలో చెరగని ముద్ర వేసి, చిరస్థాయిగా నిలిచిపోయాయి. ఆ గాయాలు మానకుండా, మనసుల్లో నిప్పును రగిలించాయి. “మనం ప్రత్యేకంగా ఉండాల్సిందే!” అనే కసిని పెంచాయి. అప్పటి నుంచి తెలంగాణ వాదం వివిధ రూపాల్లో కొనసాగింది, కాంగ్రెస్ పార్టీలో కూడా తెలంగాణకు చెందిన నాయకులు ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను అంతర్గతంగా, బహిరంగంగా వినిపిస్తూ వచ్చారు.

మలిదశ ఉద్యమం – ప్రజాస్వామ్య పంథాలో విజయం..

1969 తర్వాత దశాబ్దాలు గడిచినా, తెలంగాణ ఆకాంక్ష రగులుతూనే ఉంది. వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఈ వాదాన్ని బలంగా వినిపించాయి. ఈ మలిదశ ఉద్యమంలో తెలంగాణ ప్రజలు ప్రజాస్వామ్య పద్ధతుల్లో తమ నిరసనను వ్యక్తం చేశారు. ధర్నాలు, రాస్తారోకోలు, మిలియన్ మార్చ్‌లు, సకల జనుల సమ్మెలు వంటివి నిర్వహించారు. విద్యార్థులు మళ్లీ ఉద్యమంలోకి దూకారు, ఆత్మబలిదానాలు జరిగాయి.

కాంగ్రెస్ ప్రభుత్వ కృషి .. తెలంగాణ బిల్లు ఆమోదం..

ఈ సుదీర్ఘ ప్రయాణంలో.. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో కీలక పాత్ర పోషించింది. తెలంగాణ ప్రజల దశాబ్దాల కలను నిజం చేయడానికి, అప్పటి యూపీఏ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నించింది. అనేక చర్చలు, కమిటీల నివేదికలు, వివిధ వర్గాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నారు. ప్రత్యేకించి, కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ ఏర్పాటుకు గట్టి సంకల్పాన్ని ప్రదర్శించింది. పార్లమెంట్‌లో బిల్లును ప్రవేశపెట్టే సమయంలో ఎదురైన సవాళ్లను అధిగమించి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును లోక్‌సభ, రాజ్యసభలలో ఆమోదింపజేయడంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కీలక పాత్ర పోషించింది. ఇది కేవలం ఒక రాజకీయ నిర్ణయం కాదు.. తెలంగాణ ప్రజల త్యాగాలు, ఆకాంక్షలను గుర్తించి తీసుకున్న చరిత్రాత్మక అడుగు. ఆ బిల్లుకు ఆమోదం లభించిన క్షణం, తెలంగాణ ప్రజల కళ్ళల్లో ఆనందం, గుండెల్లో ఆత్మగౌరవం ఉప్పొంగింది.

Telangana Formation Day: అమరుల త్యాగాలమయం.. తెలంగాణ అవతరణం..

జూన్ 2, 2014 ఆత్మగౌరవ ఆవిర్భావం…

అలసిపోకుండా.. ఆగిపోకుండా సాగిన ఈ సుదీర్ఘ పోరాటం చివరకు ఫలించింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందిన తర్వాత, 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం అధికారికంగా ఆవిర్భవించింది. ఆ రోజు మన కల నెరవేరింది. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం నింగికెగిరింది. అందుకే జూన్ 2న తెలంగాణ అవతరణ దినోత్సవంగా జరుపుకుంటాం. ఇది కేవలం ఒక కొత్త రాష్ట్రం పుట్టిన రోజు కాదు.. దశాబ్దాల వివక్ష, అణచివేతకు వ్యతిరేకంగా పోరాడి, నెత్తురు చిందించి, ప్రాణాలొడ్డి సాధించుకున్న స్వాతంత్య్రం.

ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉంది. ముఖ్యంగా ప్రజా పాలన ద్వారా పేదల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ, రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను చేరువ చేస్తోంది. అమరుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం, తెలంగాణ రాష్ట్ర సంపదను ప్రజలందరికీ పంచడం, అన్ని రంగాల్లోనూ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపడం అనే లక్ష్యాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. త్యాగాల పునాదులపై వెలసిన ఈ తెలంగాణను సుసంపన్నంగా తీర్చిదిద్దే బాధ్యతను తమ భుజస్కంధాలపై మోస్తూ.. ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు కృషి చేస్తోంది. ఆనాడు భీమ్, చాకలి ఐలమ్మ వంటి యోధుల నుంచి మొదలై, వందలాది విద్యార్థుల ఆత్మబలిదానాల వరకు సాగిన ఈ ప్రస్థానాన్ని, త్యాగాలను ఎప్పటికీ మర్చిపోరాదు. జై తెలంగాణ! జై జై తెలంగాణ!

బూరుగడ్డ వీరబాబు

రచయిత గురించిబూరుగడ్డ వీరబాబుబూరుగడ్డ వీరబాబు సమయం తెలుగులో కాపీ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ విభాగాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 6 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, బిజినెస్, టెక్నాలజీ, విద్య, ఉద్యోగాలకు సంబంధించిన సమాచారాన్ని అందించారు.… ఇంకా చదవండి



Source link

- Advertisement -

Top Selling Gadgets

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 + 5 =

Share post:

Subscribe

Popular

More like this
Related

Clair Obscur: Expedition 33 actor reveals the lousy advice he got from Ben Starr

Clair Obscur: Expedition 33 has become so special...

Arc Raiders Nomadic Envoys stock – what does the new trader have for sale this week?

With the news that Arc Raiders updates will...

Arc Raiders trials – what’s on this week

Arc Raiders trials are important for any seasoned topside...

Top Selling Gadgets