Historical Record at Kedarnath Over 10 Lakh Devotees Visited Shrine in 42 Days know in details | kedaranath Yatra 2025: 42 రోజుల్లో 10 లక్షల మంది భక్తులు

0
24
Advertisement


Kedaranath Yatra 2025: కేవలం 42 రోజుల్లో  10 లక్షల మంది భక్తులు కేదార్ నాథ్ ని దర్శించుకున్నారు. గతంలో ఎప్పుడూ లేనంతగా భక్తుల రద్దీ కొనసాగుతోంది. చార్ ధామ్ యాత్ర కష్టమైనా , ఛాలెంజింగ్ మార్గం అయినా, వరుస ప్రమాదాలు జరుగుతున్నా కేదార్‌నాథ్ ధామ్‌లో భక్తుల సందడి పెరుగుతూనే ఉంది. 

ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి కేదార్‌నాథ్ ఆలయం. సముద్ర మట్టానికి 3 వేల 583 అడుగులో ఎత్తులో మందాకినీ నది పక్కన ఉంది కేదార్ నాథ్ ఆలయం. పరమేశ్వరుడి భక్తులకు అత్యంత ఇష్టమైన క్షేత్రం ఇది. హిమాలయాల్లో ఉన్న కేదార్‌నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యుమునోత్రిని చార్‌ధామ్ యాత్రగా పిలుస్తారు.

కేదార్ నాథ్ ఆలయాన్ని పాండవులు నిర్మించారని పురాణాల్లో ఉంది. మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత వ్యాసమహర్షి సూచన మేరకు పాండవులు కేదార్‌నాథ్ లో శివలింగాన్ని ప్రతిష్ఠించారు. ఏడాదిలో ఆరు నెలల పాటూ పూజలందుకుంటాడు ఇక్కడ శివయ్య. మిగిలిన ఆరునెలలు మంచునిండడంతో మూసివేస్తారు. మిగిలిన 6 నెలలు ఉఖీ మఠ్ లో పూజలు నిర్వహిస్తారు.  

చారిత్రక ఆధారాలప్రకారం సుమారు 1200 సంవత్సరాల క్రితం చార్ ధామ్ యాత్ర ప్రారంభించారు. అప్పటి నుంచి ఏటా ఎలాంటి ఆటంకం లేకుండా యాత్ర కొనసాగుతోంది. ప్రపంచం నలుమూలల నుంచి యాత్రికులు భారీగా తరలివస్తుంటారు. ఏటా అక్షయ తృతీయ రోజు తెరుచుకునే ఈ ఆలయాలను దర్శించుకోవడం అంటే సాహసయాత్రలా భావిస్తారు భక్తులు. దీపావళి తర్వాత మంచు కురిసే సమయంలో ఆలయ తలుపులు మూసేస్తారు. చలికాలం మొదలైనప్పుడు అప్పటి వాతావరణ పరిస్థితులను చూసుకుని ఆలయానికి వెళ్లే మార్గాలు మూసివేస్తారు. అందుకే చార్ ధామ్ యాత్ర చేయాలి అనుకున్నా..ముఖ్యంగా కేదార్ నాథ్ వెళ్లాలి అనుకున్నా వర్షాకాలం ఆరంభంకాకముందు వెళ్లడమే మంచిది. ఏటా మహాశివరాత్రి తర్వాత నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ ఆలయానికి వెళ్లాలి అనుకుంటే రోడ్డు మార్గం అందుబాటులో ఉండదు. ట్రెక్కింగ్ ద్వారా వెళ్లాలి లేదంటే డోలీ సేవలు వినియోగించుకోవచ్చు.  

మన దేశంలో కేదార్‌నాథ్ యాత్ర హరిద్వార్ లేదా రిషికేశ్ నుంచి మొదలవుతుంది. ఈ ప్రాంతాలకు సమీపంలో రైలు సౌకర్యం ఉంది,  బస్సులు, ప్రైవేట్ ట్రావెల్స్ కూడా అందుబాటులో ఉంటాయి. విమాన సేవలున్నాయి. చార్ ధామ్ యాత్రకు వెళ్లాలి అనుకుంటే కచ్చితంగా ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉండవు అందుకే ముందుగానే రూమ్స్, గెస్ట్ హౌస్ లు
 
కేదార్‌నాథ్ వెళ్లాలనుకునే వారు కనీసం వారం రోజుల సమయం తీసుకోవాలి. ఇక్కడికి వెళ్లాలనుకునే వారు హోటల్స్, రూమ్స్, ధర్మశాలలు, గెస్ట్ హౌసెస్‌ను ముందుగా బుక్ చేసుకోవాలి. ఎందుకంటే దాదాపు పర్యాటక, ఆధ్యాత్మిక ప్రదేశాల్లో అన్ని సౌకర్యాలు ఉంటాయి కానీ చార్ ధామ్ యాత్రలో ఎలాంటి సౌకర్యాలు ఉండవు.  అందుకే అన్నీ ముందుగానే చూసుకోవాల్సి ఉంటుంది. టార్చ్, ఛార్జర్, ప్రాధమిక చికిత్స కోసం సామగ్రి , వాటర్ బాటిల్స్, స్వెట్టర్లు కచ్చితంగా ఉంచుకోవాలి. చేతిలో నగదు ఉంచుకోవడం అవసరం.

షేర్ మార్కెట్ ఏ నెలలో పెరుగుతుంది , ఏ నెలలో డౌన్ అవుతుంది – ఇప్పుడు పెట్టుబడులు పెట్టడం సేఫేనా తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి

బంగారం, వెండి ధరల్లో భారీ హెచ్చు తగ్గులు..ఏ ఏ నెలల్లో పుత్తడి ధర తగ్గుతుందో పూర్తి సమాచారం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

తిరుమలలో ఉన్నది రాతి విగ్రహం కాదు.. సజీవంగా నిల్చున్న శ్రీ వేంకటేశ్వరుడు –  తిరుమలలో జరిగే సేవలేంటి? ఏ సేవలో ఏం చేస్తారు? ఏ సేవకు వెళితే మంచిది? ఈ వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి 

మరిన్ని చదవండి

ఇంకా చదవండి



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − 7 =