Jayam Ravi | కోలీవుడ్ స్టార్ హీరో రవి మోహన్ అలియాస్ జయం రవి (Jayam Ravi) రీసెంట్‌గా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న విషయం తెలిసిందే. జయం రవి-కెన్నెషా తిరుమల టూర్‌పై జయం రవి భార్య ఆర్తి స్పందించారు.

Jayam Ravi | కోలీవుడ్ స్టార్ హీరో రవి మోహన్ అలియాస్ జయం రవి (Jayam Ravi) రీసెంట్‌గా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న విషయం తెలిసిందే. సింగర్ కెన్నీషా (Keneeshaa)తో కలిసి తిరుమలకు వెళ్లి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. సంప్రదాయ దుస్తుల్లో దర్శనానికి హాజరైన వీరి ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే భార్య ఆర్తి (Aarti)తో విడాకుల వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో కెన్నీషాతో కలిసి రవి మోహన్ పదే పదే పబ్లిక్‌లో కనిపించడం, వివాహ వేడుకలు, ఈవెంట్లతో పాటు ఆలయాలకు కూడా కలిసే రావడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది.
ఈ నేపథ్యంలో జయం రవి-కెన్నెషా తిరుమల టూర్‌పై జయం రవి భార్య ఆర్తి స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర పోస్ట్ పెట్టారు. ‘నువ్వు ఇతరులను మోసం చేయొచ్చు. నిన్ను నువ్వు మోసం చేసుకోవచ్చు. కానీ దేవుడిని మోసం చేయలేవు’ అంటూ ఇన్‌స్టా స్టోరీస్‌లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.
సింగర్ కెన్నీషా-జయం రవి ప్రేమలో ఉన్నారంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. మరోవైపు జయం రవి–ఆర్తి మధ్య విడాకుల రచ్చ ప్రస్తుతం కొనసాగుతూనే ఉంది. ఇటీవల జయం రవి తన భార్యతో కలిసి జీవించలేనని కోర్టుకి వివరించగా, రవి భార్య తనకు రూ.50 లక్షల భరణం కావాలని కోరింది. కెన్నీషా వల్లే తమ వైవాహిక జీవితంలో సమస్యలు వచ్చాయని ఆర్తి ఆరోపిస్తుంది. నటుడు గణేష్ కుమార్తె వివాహంలో రవి, కెన్నీషా జంటగా కనిపించడంతో పాటు చేతులు పట్టుకొని కలియతిరిగారు. ఇదంతా చూస్తే మరి కొద్ది రోజులలో ఈ జంట పెళ్లి చేసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక ప్రస్తుతం జయం రవి రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు. ‘కరాటే బాబు’ – గణేష్ కె బాబు దర్శకత్వంలో రూపొందుతుండగా, ‘పరాశక్తి’ – సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కనుంది.
Also Read..
Hero | భార్యని వదిలేసి ప్రియురాలితో చెట్టాపట్టాల్.. స్టార్ హీరోని తిట్టిపోస్తున్న నెటిజన్స్
Anupama Parameswaran | కమర్షియల్ సినిమాల్లో వెయ్యి తప్పులున్నా పట్టించుకోరు: అనుపమ పరమేశ్వరన్
Mass Jathara | విడుదల వాయిదా పడిన రవితేజ ‘మాస్ జాతర’.. అధికారికంగా ప్రకటించిన మేకర్స్