పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ ట్రైలర్‌ని వాయిదా వేస్తున్నట్లు DVV ఎంటర్టైన్మెంట్స్ ప్రకటించింది.. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో సెప్టెంబర్ 25న విడుదల కానున్న ఈ సినిమాపై ఇప్పటికే హైప్ పీక్స్‌కి చేరింది. ట్రైలర్‌ని ఎప్పడెప్పుడు చూద్దామా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తుండగా మేకర్స్ పిడుగులాంటి వార్త చెప్పి ఉసూరుమనిపించారు. దీంతో మేకర్స్‌పై పవన్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

* డెత్ కోటా కన్ఫామ్ అట… ‘ఓజీ’ ట్రైలర్
ఈ చిత్రంలో పవన్ ఓజాజ్ గంభీర అనే పవర్ఫుల్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నాడు. విలన్‌గా బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మి నటిస్తున్నాడు. హీరోయిన్గా ప్రియాంక మోహన్.. కన్మణి అనే పాత్రలో కనిపించనుండగా, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్, ప్రకాష్‌రాజ్ తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉండటంతో థియేటర్లలో ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ హైప్‌తో చచ్చిపోయేలా ఉన్నామంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్ సినిమాపై అంచనాల్ని భారీగా పెంచేయగా.. ‘ఫైర్ స్ట్రోమ్’, ‘సువ్వి సువ్వి’, ‘గన్స్ అండ్ రోజెస్’ పాటలు చార్ట్ బస్టర్స్‌గా నిలిచాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన వాషి యో వాషి పాట గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. జపనీస్ బాషలో పవన్ పలికిన డైలాగులు సోషల్‌మీడియాని ఊపేస్తున్నాయి.
OG సినిమా ప్రమోషన్స్ చూస్తుంటే దిమ్మ తిరిగిపోతుంది. అసలు ఒక్క ప్రెస్ మీట్ కానీ, ఇంటర్వ్యూ గానీ లేకుండానే మేకర్స్ చేస్తోన్న ప్రమోషన్లు చూసి ఇండస్ట్రీ మొత్తం ముక్కున వేలేసుకుంటోంది. కేవలం సోషల్‌మీడియా ద్వారా తాజా పోస్టర్లు, అప్డేట్స్ ఇస్తూ హైప్ విపరీతంగా పెంచేస్తున్నారు. సాధారణంగా ఎంత పెద్ద సినిమా అయినా కూడా రిలీజ్‌కి పది రోజుల ముందే ట్రైలర్ రిలీజ్ చేస్తుంటారు. కానీ ఓజీ విషయంలో సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ ఫ్యాన్స్‌లో క్యురియాసిటీని విపరీతంగా పెంచేశారు. అయితే ఆదివారం ఉదయం ట్రైలర్ రిలీజ్ చేస్తామని ప్రకటించి ఇప్పుడు మాట తప్పడంతో మేకర్స్‌ని నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఓజీ కన్సర్ట్ పేరుతో భారీ ఈవెంట్ ప్లాన్ చేశారు. ఈ కార్యక్రమంలోనే ‘ఓజీ’ ట్రైలర్‌ని కూడా రిలీజ్ చేయనున్నారు. మరోవైపు ‘ఓజీ’ టిక్కెట్ల రేట్లు పెంపుతో పాటు ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతి ఇవ్వడంతో ‘ఓజీ’ తొలిరోజు భారీ కలెక్షన్లు రాబట్టేందుకు సిద్ధమైంది.
* ‘ఓజీ’కి భారీ టార్గెట్ ఫిక్స్.. హిట్టు కొట్టాలంటే ఎన్ని కోట్లు రావాలంటే!

