వచ్చే వారం దీపావళి పండుగ సందర్భంగా పాఠశాలలు, కళాశాలలకు వరుసగా రెండు రోజులు సెలవులు లభించనున్నాయి. అక్టోబర్ 19 ఆదివారం కావడంతో పాటు, అక్టోబర్ 20 (సోమవారం) దీపావళికి అధికారిక సెలవు ప్రకటించారు. ధన త్రయోదశి సందర్భంగా అక్టోబర్ 18 (శనివారం) కూడా సెలవు వచ్చే అవకాశం ఉండటంతో కొంతమందికి మూడు రోజుల పాటు సెలవులు దొరకవచ్చు. ఈ విరామ సమయాన్ని కుటుంబ సభ్యులతో పండుగలను జరుపుకోవడానికి లేదా విహారయాత్రలను ప్రణాళిక చేసుకోవడానికి వినియోగించుకోవచ్చు.
హైలైట్:
- విద్యార్థులకు గుడ్‌న్యూస్
- వరుసగా మూడ్రోజుల పాటు సెలవులు
- అక్టోబర్ 18 నుంచి 20 వరకు

దీపావళి సెలవు దినాలపై పూర్తి స్పష్టత..
ఈ సంవత్సరం దీపావళి పండుగను అక్టోబర్ 20 (సోమవారం) రోజున జరుపుకోవాలని నిర్ణయించారు. అయితే.. అమావాస్య తిథి అక్టోబర్ 21వ తేదీ సాయంత్రం వరకు ఉండడం వల్ల సెలవు ఏ తేదీన ఇస్తారనే దానిపై కొంత ప్రశ్నార్థకం ఏర్పడింది. దేశవ్యాప్తంగా చాలా రాష్ట్ర ప్రభుత్వాలు, విద్యాసంస్థలు అక్టోబర్ 20 (సోమవారం) నే ప్రధాన సెలవు దినంగా ప్రకటించాయి. ఈ రోజునే లక్ష్మీపూజ నిర్వహిస్తారు కాబట్టి దీనిని అధికారిక సెలవుగా ఖరారు చేశారు.
అక్టోబర్ 19 ఆదివారం కావడంతో అది వారపు సెలవు. ఆ మరుసటి రోజు, అంటే అక్టోబర్ 20 దీపావళి సెలవు. ఈ విధంగా సండే కలిసిరావడంతో వరుసగా రెండు రోజులు పండుగ సెలవులు లభించాయి. ఇక కొంతమంది విద్యార్థులకు మూడు రోజుల సెలవు దొరికే అవకాశం ఉంది. ఎందుకంటే అక్టోబర్ 18 (శనివారం) ధన త్రయోదశి (ధనత్రయోదశి). ఈరోజు కొన్ని హిందూ ధార్మిక విద్యాసంస్థలు సెలవు ఇవ్వవచ్చు. దీనివలన ఆ విద్యార్థులకు శని, ఆది, సోమవారం కలిపి మూడు రోజుల విరామం లభిస్తుంది. కొన్ని ప్రాంతాలలో వారి స్థానిక సంప్రదాయాలను బట్టి అక్టోబర్ 21న కూడా సగం రోజు లేదా పూర్తి సెలవు ఇవ్వవచ్చు.
అక్టోబర్ నెల మొత్తం సెలవులు..
దసరాతో ప్రారంభమై.. రెండో శనివారం, ఆదివారాలు, దీపావళితో కలుపుకుంటే, అక్టోబర్ నెలలో విద్యా సంస్థలకు మొత్తంగా తొమ్మిది నుండి పది రోజుల వరకు విరామం లభించినట్లైంది. అక్టోబర్ 26న ఆదివారం కావడంతో ఈ నెలలో సెలవుల జాబితా ముగుస్తుంది. ఇంత పెద్ద సంఖ్యలో లభించిన ఈ విరామ సమయాన్ని కుటుంబ సభ్యులతో గడపడానికి, ఉల్లాసంగా పండుగలను జరుపుకోవడానికి లేదా ఒక మంచి హాలిడే ట్రిప్‌ను ప్రణాళిక చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు.