RDO: అప్రమత్తంగా ఉండాలి: ఆర్డీఓ | Be alert: RDO

Date:

- Advertisement -



ABN
, Publish Date – Oct 22 , 2025 | 11:20 PM

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వల్ల రానున్న మూడురోజుల పాటు అధిక వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని ఆర్డీఓ మహేష్‌, తహసీల్దార్‌ సురేష్‌బాబు పేర్కొన్నారు. వారు బుధవారం ధర్మవరం చెరువుతో పాటు పోతుల నాగేపల్లి చిత్రావతి నది, రేగాటిపల్లి, గొట్లూరు చెరువులలో నీటి మ ట్టాన్ని పరిశీలించారు.

RDO: అప్రమత్తంగా ఉండాలి: ఆర్డీఓ

RDO Mahesh inspecting Dharmavaram pond

ధర్మవరం రూరల్‌, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వల్ల రానున్న మూడురోజుల పాటు అధిక వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని ఆర్డీఓ మహేష్‌, తహసీల్దార్‌ సురేష్‌బాబు పేర్కొన్నారు. వారు బుధవారం ధర్మవరం చెరువుతో పాటు పోతుల నాగేపల్లి చిత్రావతి నది, రేగాటిపల్లి, గొట్లూరు చెరువులలో నీటి మ ట్టాన్ని పరిశీలించారు. చెరువులన్నీ ఇప్పటికే 80శాతంపైగా నిం డాయని, కుంటలు, చెరువుల గట్లు తెగకుండా చర్యలు తీసుకుంటా మన్నారు. ధర్మవరం రెవెన్యూ డివిజన వ్యాప్తంగా ఆర్డీఓ కార్యాలయం తో పాటు ఆయా తహసీల్దార్‌ కార్యాలయాల్లో కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేశామన్నారు. అవసరమైతే ఆర్డీఓ కార్యాలయం కంట్రోల్‌ నెంబర్‌ 9866057959, ధర్మవరం తహసీల్దార్‌ కార్యాలయం నెంబర్‌ 9553929724కు సమాచారం అందించాలని సూచించారు. ఆయన వెంట వీఆర్‌ఓలు రవిశేఖర్‌రెడ్డి, విష్ణువర్ధన తదితరులు ఉన్నారు.

నంబులపూలకుంట: అల్పపీడన ప్రభావంతో మూడు రోజుల పాటు మండలంలో వర్షాలు భారీగా కురవనున్నాయనీ, ప్రజలు అప్ర మత్తంగా ఉండాలని తహసీల్దార్‌ దేవేంద్రనాయక్‌ సూచించారు. మండలంలోని పెడబల్లి జలాశయం, పరిసర పాంత్రాలను పరిశీలిం చారు. ఎగువన ఉన్న సిజి ప్రాజెక్ట్‌ గేట్లు తెరవనున్నారనీ, పెడబల్లి జలాశయంనిండే అవకాశం ఉందన్నారు. మండలంలో ఎటువంటి ప్రమాదం పొంచి ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.

అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం….

Updated Date – Oct 22 , 2025 | 11:20 PM



Source link

- Advertisement -

Top Selling Gadgets

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen + nineteen =

Share post:

Subscribe

Popular

More like this
Related

Top Selling Gadgets