
పుష్ప – 2 చిత్రంతో సినిమా హద్దులను చెరిపేసిన అల్లు అర్జున్ (Allu Arjun).. ఇప్పుడు మరోసారి పాన్ ఇండియా రేంజ్‌లో గురి పెట్టాడు. అల్లు అర్జున్-అట్లీ సినిమాపై అధికారికంగా ప్రకటన వచ్చేసింది. కోలీవుడ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ ‘సన్ పిక్చర్స్’ అత్యంత భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మించడానికి ప్లాన్ చేస్తుంది. నేడు బన్నీ పుట్టినరోజు కావడంతో ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ.. ‘AA22’ పేరుతో చిత్రాన్ని ప్రకటించారు.
విజయ్ హీరోగా వరుసగా మెర్సల్, బిగిల్, తేరి చిత్రాలు చేసి తమిళ ఇండస్ట్రీలో హ్యాట్రిక్ కొట్టిన అట్లీ.. ఆ తర్వాత బాలీవుడ్‌కి వెళ్లి నటుడు షారుఖ్ ఖాన్‌తో జవాన్ తెరకెక్కించి అక్కడ కూడా సూపర్ హిట్ అందకున్నాడు. అలా పాన్ ఇండియా రేంజ్‌లో సత్తా చాటి గుర్తుంపు తెచ్చుకున్న సౌత్ ఇండియా స్టార్స్ కలిసి ఒక ప్రాజెక్ట్ కోసం పనిచేస్తే రికార్డ్స్ ఏమైనా మిగులుతాయా..? అంటూ అభిమానులు పోస్ట్‌లు పెడుతున్నారు.