Amrutha Phone Call To Ranganath,రంగనాథ్‌కు అమృత ప్రణయ్ ఫోన్ కాల్.. ధన్యవాదాలు చెప్తూ ఎమోషనల్..! – amrutha phone call to hydra commissioner av ranganath about court verdict on pranay murder case

Date:

- Advertisement -


తెలంగాణ మొత్తాన్ని ఉలిక్కిపడేలా చేసిన ప్రణయ్ హత్య కేసులో.. ఏడేళ్ల తర్వాత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఏ1 మారుతీరావు ఆత్మహత్య చేసుకోగా.. ఏ2కు ఉరిశిక్ష, మిగతా నిందితులను యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అయితే.. కోర్టు తీర్పు అనంతరం అమృత.. హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు ఫోన్ చేసింది. హత్య సమయంలో నల్గొండ ఎస్పీగా ఉన్న రంగనాథ్ నిజాయితీగా దర్యాప్తు చేయటం వల్లే.. ఈరోజు న్యాయం జరిగిందంటూ అమృత.. భావోద్వేగానికి లోనైనట్టు తెలుస్తోంది.

Samayam Teluguరంగనాథ్‌కు అమృత ప్రణయ్ ఫోన్ కాల్
రంగనాథ్‌కు అమృత ప్రణయ్ ఫోన్ కాల్

Amrutha Varshini: 2018లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో నేడు (మార్చి 10న) నల్గొండ కోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఏ1 అయిన మారుతీ రావు ఆత్మహత్య చేసుకోవటంతో.. మిగిలిన నిందితులకు శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఏ2కు ఉరిశిక్ష విధించిన న్యాయస్థానం.. మిగిలిన ఆరుగురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అయితే.. 2018లో ఈ హత్య జరిగినప్పుడు.. ప్రస్తుతం హైడ్రా కమిషనర్‌గా ఉన్న రంగనాథ్ నల్గొండ ఎస్పీగా ఉన్నారు. దీంతో.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఈ కేసును రంగనాథ్ ప్రత్యేకంగా డీల్ చేశారు. కేవలం మూడు రోజుల్లోనే కేసును చేధించారు.

అయితే.. ప్రస్తుతం ఈ కేసులో ఏడేళ్ల తర్వాత న్యాయస్థానం తీర్పు వెలువరించిన నేపథ్యంలో.. తనకు అండగా నిలిచి, భరోసా ఇచ్చిన రంగనాథ్‌ను.. ప్రణయ్ భార్య అమృత గుర్తుచేసుకుంది. నేరస్థులకు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని అప్పుడు ఆయన ఇచ్చిన మాట నేడు నెరవేరటంతో.. ఆయనకు కృతజ్ఞతలు తెలిపేందుకు రంగనాథ్‌కు నేరుగా ఫోన్ చేసింది అమృత.

అసలైన నేరస్థులకు శిక్ష పడుతుందని ఆరోజు చెప్పిన మాటలు నిజమయ్యాయంటూ రంగనాథ్‌తో అమృత చెప్పినట్టు తెలుస్తోంది. అయితే.. ఆరోజు ఎదురైన సవాళ్లు, ఒత్తిళ్లకు లొంగకుండా కఠినంగా, నిజాయితీగా వ్యవహరించటం వల్లే ఈరోజు న్యాయం జరిగిందంటూ ధన్యవాదాలు తెలిపింది. ఈ సందర్భంగా అమృత భావోద్వేగానికి గురైనట్లు తెలుస్తోంది.

ఇదే క్రమంలో.. అమృతతో మాట్లాడుతూ ఎప్పటికైనా న్యాయం గెలుస్తుందని మీరు నమ్మారని.. అందుకు తగ్గట్టుగానే తీర్పు వచ్చిందని రంగనాథ్ తెలిపారు. ముందు నుంచి తమపై నమ్మకం ఉంచినందుకు అమృతకు ఏవీ రంగనాథ్ కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కేసు విషయమై రంగనాథ్‌ మాట్లాడుతూ.. ప్రణయ్ హత్య కేసులో అన్ని కోణాలు ఉన్నాయని తెలిపారు. ఇది ఒక పరువు హత్యే అయినా.. కాంట్రాక్ట్ కిల్లర్లతో మర్డర్ చేపించటంతో పాటు, సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఉపయోగించి తెలివిగా వ్యవహరించారని రంగనాథ్ వివరించారు. కేసు మొదట్లో చాలా గందరగోళంగా ఉందని.. మారుతీరావు కూడా తనకు ఏమీ తెలియదంటూ బుకాయించాడని చెప్పుకొచ్చారు. అయినప్పటికీ.. దర్యాప్తు ప్రారంభించిన 3 రోజుల్లోనే కేసును ఛేదించినట్టు ఆనాటి సంగతులను రందనాథ్ తెలిపారు. కోర్టు వెలువరించిన తీర్పుతో తాను సంతృప్తిగా ఉన్నానని తెలిపారు.

రామ్ ప్రసాద్

రచయిత గురించిరామ్ ప్రసాద్రాంప్రసాద్ తుప్పారం సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, స్పోర్ట్స్, సినిమాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి



Source link

- Advertisement -

Top Selling Gadgets

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 − 5 =

Share post:

Subscribe

Popular

More like this
Related

Top Selling Gadgets