Photo : Times Now Digital
ఈ రోజు పంచాంగం:
23 అక్టోబర్ 2025, గురువారం
సంవత్సరం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం
ఋతువు: శరత్
మాసం: కార్తీక
తిథి: విదియ రా. 10:47 వరకు, తరువాత తదియ
నక్షత్రం: విశాఖ తె. 4:45+ వరకు, తరువాత అనురాధ
వర్జ్యం: ఉ. 8:09 నుండి ఉ. 9:57 వరకు
దుర్ముహూర్తం: ఉ. 10:05 నుండి ఉ. 10:51 వరకు, మ. 2:41 నుండి మ. 3:27 వరకు
రాహుకాలం: మ. 1:26 నుండి మ. 2:54 వరకు
యమగండం: ఉ. 6:15 నుండి ఉ. 7:41 వరకు
బ్రహ్మముహూర్తం: తె. 4:41 నుండి తె. 5:28 వరకు
అమృత ఘడియలు: సా. 6:56 నుండి రా. 8:44 వరకు
అభిజిత్ ముహూర్తం: ఉ. 11:37 నుండి మ. 12:23 వరకు (నోట్: “+” అనగా ఆ సమయం మరుసటి రోజున కూడా కొనసాగుతుంది)
ద్వాదశ రాశులకు ఈ రోజు రాశి ఫలాలు….
మేషరాశి:
ఏ రోజు మీకు గ్రహబలం పాక్షికంగా అనుకూలిస్తుంది. పనుల్లో ఆలస్యం సంభవం. వ్యాపారులకు, కాంట్రాక్టర్లకు, వృత్తి నిపుణులకు ఈ రోజు మందకొడిగా సాగుతుంది. ఉద్యోగాలకు శ్రమ పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అనవసర విభేదాలకు ఆస్కారం ఉంది జాగ్రత్త. ఆర్థికంగా కొంచెం ఇబ్బందికరమైన రోజు. శివారాధన మీకు శుభాలనిస్తుంది. హనుమాన్ చాలిసాను జపించండి.
లక్కీ కలర్ : నీలం
లక్కీ నెంబర్ : 6
వృషభరాశి:
ఈ రోజు గ్రహబలం అనుకూలం. వృత్తి వ్యాపారాల్లో పురోభివృద్ధి కన్పిస్తుంది. నూతన వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి. మీరు గతంలో పడ్డ శ్రమ ఇప్పుడు ఫలితాన్నిస్తుంది. నూతన వాహన, వస్తువులను కొనే అవకాశం కనిపిస్తుంది. ఉద్యోగులకు దిగ్విజయమైన రోజు. అన్ని వర్గాల వారికీ ఏ రోజు ధనలాభాలు కనిపిస్తున్నాయి. విష్ణు సహస్రనామాల పారాయణ మీకు శుభకరం.
లక్కీ కలర్ : పసుపు
లక్కీ నెంబర్ : 5
మిథునరాశి:
ఈ రోజు ఈ రాశివారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. మీకు ఆర్థికంగా కలిసొచ్చే కాలం. స్థిరాస్తులు కొనడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. బందుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాల్లో నూతన ఉత్సాహం వెల్లివిరుస్తుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. వ్యవహారాల్లో జయం సంభవం. ఆర్థికంగా అద్భుతమైన రోజు. ఈ రోజు మీరు వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని తులసిమాలను సమర్పించండి. అద్భుతాలు జరుగుతాయి.
లక్కీ కలర్ : బంగారు రంగు.
లక్కీ నెంబర్ : 6
కర్కాటకరాశి:
ఈ రోజు గ్రహాల అనుకూలత మీకు తక్కువగా ఉంది. వ్యాపారాలు రిస్క్ ఉండే నిర్ణయాలకు దూరంగా ఉండండి. లేదంటే నష్టపోతారు. దూరప్రయాణాలు అనుకూలమైన రోజు అస్సలు కాదు. వీలైతే వాయిదా వెయ్యండి. పనుల్లో శ్రమాధిక్యత కనిపిస్తుంది. ఉద్యోగులకు విపరీతమైన పని ఒత్తిడి ఇబ్బంది పెడుతుంది. సహనంతో ఉండండి. ఈ రోజు మీకు ముఖ్య సూచన తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. గణపతి ఆరాధన మీకు ఇబ్బందులు తొలగిస్తుంది.
లక్కీ కలర్ : నిమ్మ పండు రంగు
లక్కీ నెంబర్ : 5
సింహరాశి :
ఈ రోజు మీకు గ్రహబలం మిశ్రమంగా ఉంది. తలపెట్టిన పనులు ఆటంకాలతో పూర్తవుతాయి. వ్యాపారులకు ఈ రోజు వ్యయప్రయాసలు ఎక్కువగా ఉంటాయి. రుణాల జోలికి పోవద్దు. హామీలు ఉండవద్దు. నిరుద్యోగులకు ప్రయత్నాలు కష్టం మీద ఫలిస్తాయి. ఉద్యోగులకు పనిపై శ్రద్ద వహించవలసిన రోజు. ఈ రోజు ఆదిత్య హృదయాన్ని పారాయణ చెయ్యండి. అమ్మవారి ఆరాధన మీకు ఇబ్బందులు తొలగిస్తుంది.
లక్కీ కలర్ : కనకాంబరం రంగు
లక్కీ నెంబర్ : 9
కన్యారాశి:
ఈ రోజు మీకు గ్రహబలం చాలా అనుకూలంగా ఉంది. కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంటుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారులకు ధనలాభాలు కన్పిస్తున్నాయి. తలపెట్టిన పనులు విజయవంతమవుతాయి. ప్రముఖుల పరిచయాలు లాభిస్తాయి. ఉద్యోగులకు అనేక రకాలుగా శుభాలు జరిగే అవకాశం కన్పిస్తుంది. పై అధికారుల మన్ననలు, గుర్తింపు లభిస్తుంది. విష్ణు సహస్రనామాల పారాయణ మీకు శుభాలనిస్తుంది.
లక్కీ కలర్ : పసుపు
లక్కీ నెంబర్ : 5
తులారాశి:
ఈ రోజు గ్రహబలం తక్కువగా ఉంది. చంద్రబలం బాగానే ఉన్నప్పటికీ పనులు ఆలస్యమవుతాయి. అనవసరంగా మాటపట్టింపులు పోవద్దు. ఉద్యోగాలకు విశ్రాంతి లేనంత పని భారం ఉండే అవకాశముంది. అయితే సమయానికి ధనం సర్దుబాటు అవుతుంది. ఖర్చులు అదుపుతప్పే అవకాశముంది. నిరుద్యోగులకు అనుకూలమైన రోజు కాదు. ఈ రోజు వెంకటేశ్వరస్వామి ఆరాధన మీకు ఇబ్బందులను తొలగిస్తుంది. షిర్డీ సాయినాథుడిని దర్శించుకోండి. శుభాలు కలుగుతాయి.
లక్కీ కలర్ : లేత గచ్చకాయ రంగు
లక్కీ నెంబర్ : 9
వృశ్చికరాశి:
ఈ రోజు గ్రహబలం అనుకూలంగా ఉంది. తలపెట్టినపనులు విజయవంతమవుతాయి. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశముంది. వ్యాపారులకు చాలా అనుకూలమైన రోజు. పట్టిందల్లా బంగారం అన్నట్టు ఉంటుంది. ఉద్యోగులకు అధికారుల మెప్పు లభిస్తుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఒక్క ముఖ్య సూచన… శత్రువులపై కన్నేసి ఉంచండి. హనుమంతుడికి ఆకుపూజ చేయించండి. వీలుకానివారు హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోండి. శుభాలు కలుగుతాయి.
లక్కీ కలర్ : లేత కాషాయం
లక్కీ నెంబర్ : 3
ధనూరాశి:
ఈ రోజు మీకు గ్రహబలం పాక్షికంగా అనుకూలం. తలపెట్టినపనుల్లో ఆలస్యం సంభవం. అనవసరమైన ఖర్చులు ఇబ్బందిపెడతాయి. వ్యాపారులకు ఈ రోజు అంతగా అనుకూలం కాదు. ధనాపరంగా కటకట గా ఉంటుంది. ఉద్యోగులు అనవసర విషయాల్లోకి వెళ్లకుండా పనిపై శ్రద్ద వహించాలి. ఈ రోజు మీరు దత్తాత్రేయుడిని ఆరాధించండి. శుభాలు కలుగుతాయి.
లక్కీ కలర్ : బంగారు వర్ణం
లక్కీ నెంబర్ : 9
మకరరాశి:
ఈ రోజు గ్రహబలం బాగుంది. తలచినపనులు సమయానికి పూర్తవుతాయి. వ్యవహారాల్లో జయం కన్పిస్తుంది. ఆస్తివ్యవహారాల్లో శుభవార్తలు వింటారు. ఒక కీలక సమాచారం ఆనందాన్ని కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో గతంలో ఉన్న సమస్యలు తొలగి అధికారులతో సఖ్యతతో నెలకొంటుంది. సంతానం విషయంలో శుభవార్తలు వింటారు. వ్యాపారులకు ధనలాభాలు కనిపిస్తున్నాయి. శివారాధన మీకు శుభాలనిస్తుంది.
లక్కీ కలర్ : తెలుపు
లక్కీ నెంబర్ : 3
కుంభరాశి :
ఈ రోజు గ్రహబలం మీకు గ్రహబలం అనుకూలం గా ఉంది. ముఖ్యంగా ఉద్యోగులకు వేధిస్తున్న సమస్యలనుండి కాస్త బయటపడి ఊపిరి తీసుకుంటారు. పదోన్నతులకు అవకాశం ఉంది. దూర ప్రయాణాలు కలిసిరావు. ఆర్థికంగా ఈ రోజు అన్ని వర్గాల వారికి అనుకూలంగా ఉంది. వ్యాపారులకు చిక్కులు తొలగి నూతన ఉత్సాహం నెలకొంటుంది. ధనలాభాలు కళ్లజూస్తారు. శుభవార్తలు వినే అవకాశం ఉంది. దీర్ఘకాలిక పెట్టుబడులకు ఇది సమయం కాదని గుర్తించండి. శివారాధన మీకు శుభాలనిస్తుంది.
లక్కీ కలర్ : తెలుపు
లక్కీ నెంబర్ : 6
మీనరాశి:
ఈ రోజు గ్రహబలం పరవాలేదు. మానసికంగా ఆందోళన ఎక్కువవుతుంది. పనులు మందకొడిగా సాగుతాయి. నూతన ఉద్యోగప్రయత్నాలు అంతగా సఫలం కావు. ఉద్యోగులకు అనుకోని సమస్యలు కన్పిస్తున్నాయి. జాగ్రతగా ఉండవలిసిన కాలం. అప్పుల జోలికి పోవద్దు. వ్యాపారులకు అంతగా అనుకూలమైన రోజు కాదు. ధనాపరంగా ఇబ్బందిగా ఉంటుంది. డబ్బు రొటేషన్ కాదు. సంయమనం పాటించండి. విష్ణు సహస్రనామాల పారాయణ, లక్ష్మీ నరసింహస్వామి దర్శనం మీకు చిక్కులను దూరం చేస్తుంది.
లక్కీ కలర్ : పసుపు
లక్కీ నెంబర్ : 6



