అనిరుధ్ కి విజయ్ దేవరకొండ ‘ప్రేమలేఖ’ | Vijay Devarakonda Letter To Anirudh And Kingdom New Song

0
30
Advertisement


Vijay Devarakonda Letter To Anirudh And Kingdom New Song

గత కొన్నాళ్లుగా హిట్ పడక డీలా పడిపోయిన హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda).. కింగ్డమ్ సినిమాతో ఎలా అయినా హిట్ కొట్టాలనుకుంటున్నాడు. మే 30న ఈ మూవీ పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే  ‘హృదయం లోపల’ అని చిత్రంలోని తొలి పాటని రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు అనిరుధ్(Anirudh Ravichander)కి విజయ్ ప్రేమలేఖ రాయడం విశేషం.

(ఇదీ చదవండి: చేసిన ప్రతి సినిమా హిట్.. ఎవరీ శ్రీనిధి శెట్టి?

‘మనం పాట రిలీజ్ చేశాం కదా. ఈ సందర్భంగా అనిరుధ్ కి నా చిన్న ప్రేమలేఖ. వీఐపీ, త్రీ సినిమాలు రిలీజైనప్పటి నుంచే నేను అనిరుధ్ కి వీరాభిమానిని. అసలు ఈ కుర్రాడెవరా? నేను యాక్టర్ ‍అయిన తర్వాత అతడు మ్యూజిక్ కి నేను స్క్రీన్ పై కనిపించాలని అనుకునేవాడిని. పదేళ్ల తర్వాత ఇప్పుడు నా 13వ సినిమా రిలీజ్ కి రెడీ. మరో 28 రోజుల్లో థియేటర్లలోకి రానుంది. ఇది విజయ్ దేవరకొండ-అనిరుధ్ తొలి పాట. ఇప్పుడు నేను చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నా’ అని విజయ్ దేవరకొండ ట్వీట్ పెట్టాడు.

‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన కింగ్డమ్ మూవీని యాక్షన్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీశారు. విజయ్ దేవరకొండ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. అనిరుధ్ సంగీతమందించాడు. ఇప్పుడు ఈ పాటతో ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఈ నెలంతా చేస్తూనే ఉంటారు. మరి ఈసారైనా ‘కింగ్డమ్’ మూవీతో(Kingdom Movie) విజయ్ హిట్ కొడతాడా లేదా అనేది చూడాలి?

(ఇదీ చదవండి: ఓటీటీల్లోకి వచ్చేసిన 30 సినిమాలు.. ఈ రెండు రోజుల్లోనే) 





Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 1 =