కుబేర.. తమిళనాట ఏం జరుగుతోంది? Great Andhra

0
22
Advertisement


కుబేర విషయంలో మొదట్నుంచి ప్లానింగ్ లోపం కనిపిస్తోంది. షూటింగ్ లోనే కాదు, చివరికి ప్రమోషన్ విషయంలో కూడా ఇది కొట్టొచ్చినట్టు కనిపించింది. ఓవైపు ఫస్ట్ కాపీ రెడీ అవ్వక, మరోవైపు సాంగ్స్ విడుదలవ్వక, ఇంకోవైపు నటీనటులతో ప్రచారం చేయలేక యూనిట్ కిందామీద పడింది.

ఇప్పుడీ సినిమా విషయంలో మరో లోపం కనిపించింది. మరికొన్ని గంటల్లో సినిమా థియేటర్లలోకి రాబోతుండగా, కీలకమైన తమిళనాట ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ పూర్తిస్థాయిలో ఓపెన్ కాలేదు.

ధనుష్ కు తెలుగులో కంటే తమిళ్ లోనే మంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. అతడి సినిమాలకు కోలీవుడ్ లోనే కలెక్షన్లు బాగా వస్తాయి. అలాంటి హీరోతో సినిమా చేస్తూ, కోలీవుడ్ లో ఇవాళ్టికీ అడ్వాన్స్ బుకింగ్స్ పూర్తిస్థాయిలో ఓపెన్ చేయలేకపోయారంటే ప్లానింగ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఈ సినిమా తమిళ వెర్షన్ సెన్సార్ ఫార్మాలిటీస్ చెన్నైలో జరుగుతున్నాయి. తెలుగు వెర్షన్, తమిళ వెర్షన్ కు రన్ టైమ్ లో కాస్త తేడా ఉంది. సెన్సార్ పూర్తయిన తర్వాత పూర్తిస్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలవుతాయి. అయితే ఇప్పటికే చాలా ఆలస్యమైంది.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − 17 =