
మరో 4 రోజుల్లో పుట్టినరోజు చేసుకోబోతున్నాడు ఎన్టీఆర్. అతడు నటిస్తున్న వార్-2 నుంచి ఓ సర్ ప్రైజ్ రాబోతోంది. స్వయంగా హీరో హృతిక్, ఈ విషయాన్ని వెల్లడించాడు. తారక్ కు కూడా తెలియని సర్ ప్రైజ్ రాబోతోందని ఊరించాడు.
దీంతో ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానుల చూపు కొరటాల శివపై పడింది. ఈ పుట్టినరోజుకు దేవర-2పై కూడా ఓ స్పష్టమైన ప్రకటన చేస్తే బాగుంటుందని, హృతిక్ లా కొరటాల కూడా ఓ ఊరించే ట్వీట్ పెట్టాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.
దేవర-2పై మొన్నటివరకు చాలా అనుమానాలు చెలరేగాయి. ఒక దశలో ఇక పార్ట్-2 రాదనే ప్రచారం కూడా జరిగింది. కాబట్టి ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా దేవర-2పై ప్రకటన చేస్తే బాగుంటుందని అతడి ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
నిజానికి ఎన్టీఆర్ అభిమానుల్లో చాలామందికి వార్-2 కంటే దేవర-2 అప్ డేట్స్ తెలుసుకోవాలనే ఆసక్తే ఎక్కువగా ఉంది. ఆ సినిమా ఇంపాక్ట్ అలాంటిది. దీంతో పాటు ప్రస్తుతం సెట్స్ పై ఉన్న డ్రాగన్ నుంచి కూడా కచ్చితంగా అప్ డేట్ రాబోతోంది. సో.. ఈసారి తారక్ ఫ్యాన్స్ కు పండగే.
