హద్దులు దాటిన బూతులు.. ఓటీటీలకు ఫ్యామిలీ ఆడియన్స్ దూరమవుతున్నారా..?

0
9
Advertisement


Published on Feb 6, 2025 3:00 AM IST

ఒక సినిమాను థియేటర్‌లో చూసి ఎంజాయ్ చేయడానికి సగటు ప్రేక్షకుడు ఎంతో ఇష్టపడతాడు. కానీ.. ప్రస్తుత కాలంలో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల సంఖ్య భారీగా పెరిగింది. దీంతో ప్రేక్షకులు వాటిలో వచ్చే కంటెంట్‌ను ఇంట్లో కూర్చుని తమ ఫ్యామిలీతో కలిసి వీక్షించేందుకు మక్కువ చూపుతున్నారు. అయితే, కొన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో వచ్చే కంటెంట్ చూస్తుంటే అవి కాస్త శ్రుతి మించినట్లు గా కనిపిస్తున్నాయి.

ఇప్పటికే చాలా సిరీస్ బోల్డ్ డైలాగ్స్, యాక్షన్ సీన్స్, రొమాన్స్.. ఇలా చాలా అంశాల్లో ఫ్యామిలీ ఆడియెన్స్‌కు చిరాకు తెప్పిస్తున్నాయి. కానీ, ఇప్పుడు తెలుగులో తెరకెక్కుతున్న సిరీస్‌లు కూడా ఇదే బాటలో వెళ్తున్నాయి. తాజాగా డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ‘కోబలి’ వెబ్ సిరీస్ దీనికి ఓ ఉదాహరణగా చెప్పవచ్చు. ఒక గ్రామీణ నేపథ్యంలో సాగే రివెంజ్ యాక్షన్ డ్రామాగా ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది. అయితే, ఇందులో చాలా బోల్డ్ డైలాగులు ప్రేక్షకులకు చిరాకు తెప్పిస్తాయి.

కొన్ని సీన్స్ పరిధిమేర వినియోగించినట్లు అనిపించినా.. చాలా డైలాగులు కేవలం ఆడియెన్స్ దృష్టిలో పడేందుకే వాడినట్లుగా అనిపిస్తాయి. ఇలాంటి వెబ్ సిరీస్‌లలో బూతులు ఎక్కువగా ఉండటం, ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఇవి చూడకుండా చేస్తుందని మేకర్స్ ఎప్పుడు గ్రహిస్తారో. మరి ఇకనైనా ఓటీటీలో ఇలాంటి బూతులు హద్దులు దాటకుండా ఉండేలా.. ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా ఈ వెబ్ సిరీస్‌లు చూసేలా మేకర్స్ జాగ్రత్తలు తీసుకుంటారేమో చూడాలి.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × two =