Ap Government Auto Driverla Sevalo Funds Release,ఏపీలో కొత్త పథకం.. ఒక్కొక్కరికీ రూ. 15000.. 2.90 లక్షల మందికి లబ్ధి.. – ap government to launch auto driverla sevalo scheme on october 4 and release 435 crore funds

Date:

- Advertisement -


ఏపీ ప్రభుత్వం మరో పథకం అమలుకు సిద్ధమైంది. ఆటో డ్రైవర్లకు సేవలో పథకం రేపు ప్రారంభించనుంది. ఈ పథకం కింద అర్హులైన ఆటో డ్రైవర్లకు ఏటా రూ.15000 అందించనున్నారు. ఏపీలో స్త్రీ శక్తి పేరుతో మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. ఉచిత బస్సు పథకంతో ఉపాధి, గిరాకీ కోల్పోతున్న ఆటో డ్రైవర్లను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ ఆటోడ్రైవర్ సేవలో పథకం తీసుకువస్తున్నారు. ఈ పథకం కింద సుమారుగా రూ.2.90 లక్షల మంది ఆటో డ్రైవర్లకు రూ.15 వేలు చొప్పున రూ.435 కోట్లు జమ చేయనున్నారు.

Auto Driverla sevalo
ఏపీలో రేపటి నుంచి కొత్త పథకం.. 2.90 లక్షల మందికి లబ్ధి.. ఒక్కొక్కరికీ 15000 అకౌంట్లో జమ..(ఫోటోలు– Samayam Telugu)
ఏపీలోని ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్. కూటమి ప్రభుత్వం ఆటోడ్రైవర్లకు దసరా కానుక అందించనుంది . శనివారం ఉదయం 11 గంటలకు 2,90,234 మంది ఆటో రిక్షా/ మాక్సి క్యాబ్/ మోటార్ క్యాబ్ డ్రైవర్ల ఖాతాల్లోకి రూ.435.35 కోట్లు జమ చేయనుంది. ఆటో డ్రైవర్ల సేవలో పథకం పేరుతో ప్రతి ఏటా అర్హులైన ఆటో డ్రైవర్లకు రూ.15000 చొప్పున ఆర్థిక సాయం అందించనుంది. ఏపీ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు పథకం స్త్రీ శక్తి పథకం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. స్త్రీ శక్తి పథకం అమలుతో ఆదాయం కోల్పోతున్న ఆటో డ్రైవర్ల కుటుంబాలను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం ఈ ఆటో డ్రైవర్లకు సేవలో పథకం అమలు చేయనుంది. శనివారం ఉదయం 11 గంటలకు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో జరిగే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు , డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ కార్యక్రమం ప్రారంభించనున్నారు.
మరోవైపు ఆటో డ్రైవర్లకు సేవలో పథకం కింద 2,25,621 మంది ఆటో డ్రైవర్లు, త్రీ వీలర్ ప్యాసింజర్ వాహనాల డ్రైవర్లు 38,576 మందికి.. అలాగే 20,072 మోటార్ క్యాబ్ డ్రైవర్లు , మ్యాక్సి క్యాబ్ డ్రైవర్లు 6,400 మందికి రూ.15000 చొప్పున అందించనున్నారు. స్త్రీ శక్తి పథకం కారణంగా గిరాకీ తగ్గడంతో పాటుగా రిపేర్ ఖర్చులు, నిర్వహణ వ్యయాలతో ఆటో డ్రైవర్లు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం ఈ ఆటో డ్రైవర్లకు సేవలో పథకం అమలు చేస్తోంది. ఇక వాహనాల యజమానుల కోసం గ్రీన్ ట్యాక్స్‌ను కుదించింది. రూ.20 వేలు ఉన్న గ్రీన్ ట్యాక్స్ ను ఏపీ ప్రభుత్వం రూ.3 వేలకు తగ్గించిన సంగతి తెలిసిందే.

జమ్మి చెట్టుకు పూజ.. ఏపీ సీఎం, బీజేపీ చీఫ్ మధ్య ఆసక్తికర సంభాషణ

మరోవైపు ఆటో డ్రైవర్లకు సేవలో పథకం కింద అర్హులైన వారికి ఆర్థిక సాయం అందించే ఏర్పాట్లు పూర్తి చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సాయం అందించాలని ప్రభుత్వం అధికారులకు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఆటో డ్రైవర్లకు సేవలో పథకం అర్హుల జాబితాలో పేరు లేని వారు దరఖాస్తు చేసుకున్న వెంటనే అర్హతను ధ్రువీకరించుకుని అర్హుల జాబితాలో చేర్చే ఏర్పాట్లు చేశారు. ఈ పథకం అమల్లో వచ్చే ఫిర్యాదుల పరిష్కారం కోసం ఏపీ ప్రభుత్వం ఓ వ్యవస్థను ఏర్పాటు చేసింది. వాట్సాప్ ద్వారా ప్రత్యేక గ్రీవెన్స్ హ్యాండ్లింగ్ సిస్టమ్‌ అందుబాటులోకి తెచ్చింది. అయితే ఆటో డ్రైవర్లకు సేవలో పథకం లబ్ధి పొందాలంటే లబ్ధిదారులు తప్పనిసరిగా ఏపీలో చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ కల్గి ఉండాలి.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, రాజకీయ వార్తలతోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ఆసక్తికర కథనాలు, స్పెషల్ ఆర్టికల్స్ రాశారు. గతంలో వీడియో టీమ్‌లో పని చేసిన వెంకటరమణకు స్పోర్ట్స్ న్యూస్ రాసిన అనుభవం కూడా ఉంది. జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉన్న వెంకటరమణ గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో నేషనల్. ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2025, ఫిబ్రవరిలో వెంకటరమణ టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి