Lokah Chapter 1: Chandra OTT
Photo : Times Now Digital
కళ్యాణి ప్రియదర్శిన్ సూపర్ ఉమెన్ గా నటించిన లోక చాప్టర్ 1 (Lokah Chapter 1: Chandra) మలయాళం లో పెద్ద హిట్టైంది. ఏకంగా 300 కోట్లు వసూలు చేసి మలయాళ చిత్ర పరిశ్రమలో కొత్త రికార్డులు సెట్ చేసింది. తెలుగు లో కూడా కొత్త లోక పేరుతో రిలీజయిన ఈ చిత్రం ఇక్కడ కూడా బాగానే ఆడింది. అయితే సినిమా రిలీజయి 50 రోజులకు పైగా దాటినా ఇప్పటివరకు OTT లో రాలేదు. సినిమా ఓటిటీ డీల్ ముందుగా పూర్తవకపోవడంతో సినిమా హిట్ తరువాత దిగ్గజ ఓటిటీ సంస్థలు భారీ మొత్తాలు ఆఫర్ చేశాయని వార్తలు వచ్చాయి. అయితే డీల్ పూర్తికాలేదు. తరువాత జియో హాట్ స్టార్ పేరు ముందుకొచ్చింది. ఎట్టకేలకు హాట్ స్టార్ కొత్త లోక సినిమా ఓటిటీ స్ట్రీమింగ్ డేట్ ను అనౌన్స్ చేసింది…ఈ వారమే ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది….
జియో హాట్ స్టార్ లోక చాప్టర్ 1 (Lokah Chapter 1: Chandra) సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫర్మ్ చేస్తూ ఒక పోస్టర్ ను రిలీజ్ చేసింది. అక్టోబర్ 31 నుండి తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, బెంగాలీ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్టు తెలిపింది. సో సినీ లవర్స్ ఈ వీకెండ్ కు హాయిగా ఫ్యామిలీతో ఇంట్లో కూర్చుని ఈ సినిమాను ఎంజాయ్ చేసేయ్యొచ్చు.
కథ విషయానికొస్తే చంద్ర (కళ్యాణి ప్రియదర్శిన్) సూపర్ పవర్స్ ఉన్న అమ్మాయి. ఓ మిషన్ లో శత్రువుల నుండి తప్పించుకున్న ఆమె బెంగళూరులో సైలెంట్ గా జీవితాన్ని గడుపుతుంది. ఆమె పక్కింట్లో ఉండే సన్నీతో ఆమె ను ఇష్టపడతాడు. వారిద్దరిమద్య అనుకోకుండా స్నేహం మొదలవుతుంది. పోలీస్ ఇన్‌స్పెక్టర్ నాచియప్ప గౌడ(శాండి మాస్టర్)కి చంద్రపై అనుమానం ఎందుకు వస్తుంది? వారిద్దరి మధ్య గొడవేంటి? అసలు ఈ చంద్ర ఎవరు…ఇదే సినిమా స్టోరీ…
కేవలం 30 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఒక కొత్త సినిమాటిక్ యూనివర్స్ ను ఎస్టాబ్లిష్ చేసింది. తక్కువ బడ్జెట్ లో తీసినా కూడా టెక్నికల్ గా మంచి అవుట్ ఫుట్ ఇచ్చారు మేకర్స్. ఇంతకు ముందు క్యూట్ హీరోయిన్ పాత్రల్లో కనిపించిన కళ్యాణి ప్రియదర్శిని ఈ సినిమాలో సూపర్ ఉమెన్ గా అదరగొట్టి అందరిని ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు లోక యూనివర్స్ లో భాగంగా ఈ సినిమాకు సీక్వెల్ కూడా మొదలుపెట్టినట్టు మేకర్స్ ప్రకటించారు. దుల్కర్ ఈ సినిమాలో హీరో పాత్రలో నటించనున్నాడు.



