NTRNeel: ఇది ‘వార్‌ 2’ టైమ్‌.. ఎన్టీఆర్‌ బర్త్‌ డేపై నిర్మాణసంస్థ పోస్ట్‌..

0
23
Advertisement


ఇంటర్నెట్ డెస్క్‌: ఎన్టీఆర్‌ (NTR) పుట్టినరోజు వస్తుందంటే సినీ ప్రియులంతా అప్‌డేట్స్‌ కోసం ఎదురుచూస్తుంటారు. ప్రస్తుతం తారక్‌ రెండు భారీ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. దీంతో ఈ బర్త్‌డేకు రెండు సినిమాల నుంచి అప్‌డేట్స్‌ వస్తాయంటూ ఫ్యాన్స్‌ సందడి చేస్తున్నారు. ప్రశాంత్‌నీల్‌ దర్శకత్వంలో రానున్న చిత్రం నుంచి అప్‌డేట్‌ ఉండదంటూ తాజాగా నిర్మాణ సంస్థ పోస్ట్‌ పెట్టింది.

ఎన్టీఆర్‌ (NTR), దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ (Prasanth Neel) కాంబినేషన్‌లో రానున్న సినిమా గురించి నిర్మాణసంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ పోస్ట్‌ పెట్టింది. ‘‘ఇది పూర్తిగా ‘వార్‌ 2’ టైమ్‌.. మేం ఈ సినిమాను గౌరవిస్తున్నాం. మన మారణహోమాన్ని ప్రారంభించే ముందు.. దీన్ని (WAR 2) సెలబ్రేట్‌ చేసుకుందాం. మన మాస్‌ మిస్సైల్‌ను సరైన సమయంలో విడుదల చేద్దాం. ఈ పుట్టినరోజును ‘వార్ 2’తో చేసుకోండి’’ అంటూ అభిమానులను ఉద్దేశించి పోస్ట్‌ పెట్టింది. దీంతో ప్రశాంత్‌నీల్‌ మూవీ నుంచి అప్‌డేట్‌ లేదని స్పష్టమైంది.

హృతిక్‌ రోషన్‌, ఎన్టీఆర్‌ కీలక పాత్రల్లో రూపొందుతున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘వార్‌2’. అయాన్‌ ముఖర్జీ దర్శకుడు. ఈ పాన్‌ ఇండియా చిత్రాన్ని యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ నిర్మిస్తోంది. కియారా అడ్వాణీ (Kiara Advani) కథానాయిక. ఆగస్టు 14న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఎన్టీఆర్‌ పుట్టినరోజును పురస్కరించుకొని మే 20న సర్‌ప్రైజ్‌ ఇవ్వనున్నారు. గ్లింప్స్‌ను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. 



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 2 =