og movie: వాషి యో వాషి.. పవన్ పాడిన హైకూ మీనింగ్ ఇదే.. గట్టి యుద్ధమే

0
14
Advertisement


ఇంటర్నెట్‌డెస్క్‌: పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) కథానాయకుడిగా సుజీత్‌ దర్శకత్వంలో రూపొందుతున్న గ్యాంగ్‌స్టర్‌ మూవీ ‘ఓజీ’ (OG Movie). ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ సెప్టెంబరు 25న (og movie release date) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో చిత్ర బృందం వినూత్నంగా ప్రచారం చేస్తోంది. ఇందులో భాగంగా పవన్‌ స్వయంగా జపనీస్‌ హైకూను చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. ‘‘మై డియర్‌ ఓమీ.. నీలాంటి వాడిని నేలకెలా దించాలో నాకు తెలుసు’’ అంటూ మొదలైన అందులో జపనీస్‌ పదాలు ఉన్నాయి. వాటి అర్థం కోసం నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు. వీడియో సబ్‌టైటిల్స్‌ అందుకు సంబంధించిన అర్థం ఇంగ్లీష్‌ స్పష్టంగా ఉంది.

WASHI YO WASHI

గద్దా ఓ గద్దా…

Yasei no washi o korosu ni wa

నువ్వో అడవి గద్దను చంపాలంటే..

Mazu tsubasa o kiri otosu hitsu yoo ga aru

నువ్వు ముందు దాని రెక్కలు తెగ నరకాలి..

Jimen ni ochitara..me o eguri dasu

అది నేల మీద పడ్డాక దాని కళ్లు పీకేయాలి..

Me ga mienaku nari, doko ni ikeba ii no ka wakara naku suru

ఒక్కసారి అది గుడ్డిదైతే… ఎటు పోవాలో దానికి తెలియదు..

Sokode ashi o kitte ugokenaku suru

అప్పుడు దాని కాళ్లు నరికితే ఇక ఎప్పటికీ కదల్లేదు…

Soshite, yasei no shinzou o eguri dasu noda

అప్పుడు దాన్ని రాకాసి గుండెను బయటకు లాగాలి!

WASHI YO WASHI

గద్దా ఓ గద్దా…

పవన్‌కల్యాణ్‌ ఇందులో ఓజెస్‌ గంభీర అనే గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నారు. ఆయన్ను ఢీకొట్టే ఓమీ పాత్రలో ఇమ్రాన్‌ హష్మి నటిస్తున్నారు. దీన్ని బట్టి సినిమాలో పవన్, ఇమ్రాన్‌ మధ్య గట్టి యుద్ధమే ఉండబోతుందని అర్థమవుతోంది. ఇక ఇందులో గీతగా శ్రియారెడ్డి కనిపించనున్నారు. తాజాగా ఆమె పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 3 =