Star Maa Serials TRP Ratings Week 1: ఒకటి… ఒకటి… ఒకటి… ఒకటి… ఒకటి… ఒకటి… ఒకటి… ఒకటి… ఈ వారం చూసినా సరే, టీఆర్పీలో ‘కార్తీక దీపం 2 – నవ వసంతం’ మొదటి స్థానంలో ఉంది. ఈ వారం కూడా ఆ సీరియల్ తన టాప్ ప్లేస్ నిలబెట్టుకుంది. సంక్రాంతి పండగ సెలవుల వల్ల ఒక్క రోజు ఆలస్యంగా ఈ వీక్ టీఆర్పీ రేటింగ్స్ వచ్చాయి. కొత్త ఏడాదిలో ఈ వారం నుంచి కొత్తగా వీక్ స్టార్ట్ చేశారు. ఈ వారం (First Week TRP of Telugu serials 2025) టీఆర్పీల్లో టాప్ 10లో ఏయే సీరియల్స్ ఉన్నాయి? అనేది చూస్తే…
‘కార్తీక దీపం 2’కి 10.63 టీఆర్పీ…
మరి ‘స్టార్ మా’లో మిగతా సీరియల్స్?
‘కార్తీక దీపం – నవ వసంతం’ సీరియల్ (Karthika Deepam 2 TRP Rating)కు ఈ వారం 10.63 రేటింగ్ వచ్చింది. గత వారం 10.38, అంతకు ముందు వారం 10.54 టీఆర్పీ రేటింగ్ సాధించింది. ఈ వారం ‘కార్తీక దీపం 2’కు దరిదాపుల్లో ఏదీ లేదు. కానీ, దాని తర్వాత 10 ప్లస్ రేటింగ్ సాధించిన సీరియల్ ఏదైనా ఉందంటే… అది ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’.
‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’కు ఈ వారం (2025లో మొదటి వారం) ఈ వారం 10.07 రేటింగ్ వచ్చింది. గత వారంతో టీఆర్పీ (9.17)తో కంపేర్ చేస్తే ఇది ఎక్కువ. ఇక ఆ తర్వాత ‘గుండె నిండా గుడి గంటలు’ సీరియల్ 09.46, ‘చిన్ని’ సీరియల్ 08.65, ‘ఇంటింటి రామాయణం’ 8.24, ‘నువ్వుంటే నా జతగా’ సీరియల్ 07.26, ‘మగువ ఓ మగువ’ సీరియల్ 07.26 టీఆర్పీ సాధించాయి. టైమ్ స్లాట్ చేంజ్ అయ్యాక ‘బ్రహ్మముడి’ టీఆర్పీ పడింది. అయితే… లాస్ట్ వీక్ ఆ సీరియల్ 6.20 టీఆర్పీ రేటింగ్ అందుకుంది. మళ్ళీ ఈ వారం రేటింగ్ తగ్గింది. ఈ వీక్ 05.75 రేటింగ్ అందుకుంది.
మేఘ సందేశానికి దగ్గరలో జగద్ధాత్రి…
జీ తెలుగులో ఈ వీక్ టాప్ సీరియల్స్ ఏవి?
‘జీ తెలుగు’ ఛానల్ టీఆర్పీ రేటింగ్స్ చూస్తే… ఎప్పుడూ ‘మేఘ సందేశం’ సీరియల్ టాప్ ప్లేస్‌లో ఉంటుంది. ఈ వీక్ కూడా మొదటి స్థానం దానిదే. ఈ వారం ఆ సీరియల్ 07.71 టీఆర్పీ రేటింగ్ అందుకుంటుంది.
‘మేఘ సందేశం’కు ఈ వారం 07.71 టీఆర్పీ రేటింగ్ రాగా… దాని తర్వాత ‘జీ తెలుగు’లో రెండో స్థానంలో ‘జగద్ధాత్రి’ ఉంది. దానికి 07.58 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. ఇక మూడో స్థానం కోసం గట్టి పోటీ జరిగింది. ‘పడమటి సంధ్యారాగం’ 07.15 టీఆర్పీ, కొత్తగా మొదలైన ‘చామంతి’ 07.15 టీఆర్పీ సాధించాయి. వాటి తర్వాత 6.79 టీఆర్పీతో ‘నిండు నూరేళ్ళ సావాసం’ ఐదో స్థానంలో నిలిచింది. ‘అమ్మాయి గారు’ (6.04), ‘మా అన్నయ్య’ (5.11), ‘ప్రేమ ఎంత మధురం’ (4.44) టీఆర్పీ సాధించాయి.
‘రంగుల రాట్నం’ను దాటేసిన ‘మనసంతా నువ్వే’
‘రంగుల రాట్నం’ ప్రతి వారం ఈటీవీలో మొదటి స్థానంలో ఉంటుంది. ఈ వారం ఆ సీరియల్‌ను రెండో స్థానానికి నెట్టేసింది ‘మనసంతా నువ్వే’. దానికి 2.63 టీఆర్పీ రాగా… ‘రంగుల రాట్నం’ 2.45 టీఆర్పీ మాత్రమే సాధించింది. ఇక, ఆ తర్వాత స్థానాల్లో ‘రావోయి చందమామ’ (1.81), ‘బొమ్మరిల్లు’ (1.57), ‘శతమానం భవతి’ (1.52), ‘కలిసుందాం రా’ (1.32) ఉన్నాయి. జెమిని టీవీలో ‘భైరవి’ 1.01 టీఆర్పీ సాధించింది.
Also Read: ‘ఉమ్మడి కుటుంబం’ నుంచి అపర్ణ అవుట్… ప్రీతి పాత్రలో కొత్త నటి ఎంట్రీ, ఎవరో తెలుసా?
మరిన్ని చూడండి



