Venkatesh – Rana Naidu 2: నాగా నాయుడికి..  నాకూ అదే తేడా..

0
27
Advertisement



ABN
, Publish Date – Jun 02 , 2025 | 07:34 PM

వెంకటేశ్‌ (Venkatesh), రానా (Rana) కీలక పాత్రధారులుగా నటించిన వెబ్‌ సిరీస్‌ ‘రానా నాయుడు’. దీనికి కొనసాగింపుగా రానా నాయుడు -2(Rana Naidu 2) సిద్థమైన విషయం తెలిసిందే.

వెంకటేశ్‌ (Venkatesh), రానా (Rana) కీలక పాత్రధారులుగా నటించిన వెబ్‌ సిరీస్‌ ‘రానా నాయుడు’. దీనికి కొనసాగింపుగా రానా నాయుడు -2(Rana Naidu 2) సిద్థమైన విషయం తెలిసిందే. త్వరలో ఈ సిరీస్‌ ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనిని ఉద్దేశించి వెంకటేశ్‌ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీజన్‌ 2లో తన క్యారెక్టర్‌ ఎలా ఉండనుందో చెప్పారు.

ఆయన మాట్లాడుతూ “నా వ్యక్తిగత జీవితానికి సిరీస్‌లో పోషించిన పాత్రకు మధ్య ఎంతో వ్యత్యాసం ఉంటుంది. నాగా నాయుడు స్వార్థపరుడు. నియమాలను సైతం ఉల్లంఘిస్తుంటాడు. కానీ, నిజ జీవితంలో ఇలాంటి వాటికి దూరంగా ఉంటాను. నాగా నాయుడు కుటుంబం కోసం ఎంత వరకు అయినా వెళ్తాడు. చట్టవిరుద్ధంగా ప్రవర్తిస్తాడు. ఆ పాత్రని మనం ఊహించలేం. ఎప్పుడు ఏం చేస్తాడో చెప్పలేం. కానీ, అతను తన కుటుంబం కోసం ప్రాణమిస్తాడు. ఆ ఒక్క పాయింట్‌కే నేను బాగా కనెక్ట్‌ అయ్యా. నిజ జీవితంలో ఆ పాత్రకు, నాకు ఉన్న సంబంధం అదే. మేమిద్దరం మా కుటుంబాలను ప్రేమిస్తాం. నేను ఎప్పుడు, ఎలా ఉంటానో ఊహించగలరు. కానీ నాగ ఎప్పుడు ఎలా ఉంటాడో ఎవరూ ఊహించలేరు. నాగకి డ్రామా అంటే ఎక్కువ ఇష్టం. నాకు మైండ్‌ గేమ్స్‌ ఆడటం ఇష్టం ఉండదు. అలాంటి ఆటలు ఆడను. అతడు అలాంటి ఆటలతో ఆశ్చర్యపరుస్తుంటాడు. ఈ సారి ఫ్యాన్స్‌ను మరింతగా ఆకట్టుకునేలా ఈ పాత్ర ఉండనుంది’’ అని ఆయన అన్నారు. ఓటీటీ దిగ్గజ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా జూన్‌ 13 నుంచి ‘రానా నాయుడు 2’ స్ర్టీమింగ్‌ కానుంది.  

Updated Date – Jun 02 , 2025 | 07:35 PM



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 5 =