గ్రూప్‌-1 విజేతలకు నియామకపత్రాలను అందజేసిన సీఎం రేవంత్ రెడ్డి… ఆ చట్టం తెస్తామని కీలక వ్యాఖ్యలు… | telangana cm revanth reddy handed over appointment orders to group-1 selected candidates and makes key comments

Date:

- Advertisement -


telangana cm revanth reddy handed over appointment orders to group 1 selected candidates

గ్రూప్-1 విజేతలకు నియామక పత్రాలు అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి

గ్రూప్-1 కు ఎంపికైన అభ్యర్థుల భుజాలపై తెలంగాణ భవిష్యత్తు పునర్నిర్మాణ బాధ్యత ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దేశానికి తెలంగాణ మోడల్‌ను సృష్టించాలని, ప్రపంచంలోని గొప్ప నగరాలతో పోటీపడేలా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో ప్రజా పాలన – కొలువుల పండుగలో భాగంగా టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ -1 పరీక్షలో ఎంపికైన 562 మంది అభ్యర్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియామక పత్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… కొత్తగా గ్రూప్ -1 ఉద్యోగాలకు ఎంపికైన యువతీ యువకులు తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

గ్రూప్-1కు ఎంపికైన అభ్యర్థుల భుజాలపై తెలంగాణ భవిష్యత్తు పునర్నిర్మాణ బాధ్యత ఉందని తెలిపారు. బాధ్యతతో వ్యవహరించి నియామకాలు చేపట్టామని… ప్రభుత్వం ఒక గొప్ప లక్ష్యంతో ముందుకు వెళుతోందని చెప్పారు.

telangana cm revanth reddy handed over appointment orders to group 1 selected candidates 2
గ్రూప్-1 విజేతలకు నియామక పత్రాలు అందజేత కార్యక్రమం

స్వాతంత్య్రం వచ్చి వందేళ్లు పూర్తయ్యే 2047 నాటికి తెలంగాణ 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా ఎదగాలన్న లక్ష్య సాధనలో గ్రూప్-1 విజేతలు వారి వంతు పాత్ర పోషించాలని తెలిపారు.. గుజరాత్ మోడల్ అనో, ఇంకేదో అనో కాదని… మన పోటీ దేశంతోనే కాదని.. ప్రపంచంతో పోటీ పడే విధంగా తెలంగాణను తీర్చిదిద్దాలని… అందుకు కంకణబద్దులై పనిచేయాలని పిలుపునిచ్చారు.

ఉద్యోగంలో చేరిన కొత్తలో గరం, గరంగా ఉండి… తర్వాత నరం, నరంగా మారి క్రమేణా బేషరంగా మారుతారన్న నానుడి తప్పు అని నిరూపించాలని కోరారు. ‘‘ఒక నిరుపేద, నిస్సహాయుడు మీ వద్దకు వచ్చినప్పుడు వారికి సేవ చేసే విషయంలో మీ తల్లిదండ్రులు గుర్తుకు రావాలి. మీరంతా నిన్నటి వరకు నిరుద్యోగ యువకులు. ఈ రోజు నుంచి ఆఫీసర్లు. అఫీసర్లకు ఎంతో బలం ఉంది. మీ భవిష్యత్తుకు అది గ్రీన్ చానెల్. మీ భవిష్యత్తును తీర్చిదిద్దాలని రూపాయి, రూపాయి కూడబెట్టి మీకోసం సర్వం త్యాగం చేసిన మీ తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి. ఉద్యోగులెవరైనా తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే వారి జీతాల్లో 10 శాతం కోత పెట్టి తల్లిదండ్రుల ఖాతాల్లో వేసే చట్టం తెస్తాం’’ అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

telangana cm revanth reddy handed over appointment orders to group 1 selected candidates 4
గ్రూప్-1 విజేతలకు నియామక పత్రాలు అందజేత కార్యక్రమం

గ్రూప్ -1 ఉద్యోగం సాధించడానికి 3 లక్షలకుపైగా అభ్యర్థులు పోటీ పడితే అందులో 562 మంది ఎంపికయ్యారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.ఉమ్మడి రాష్ట్రంలో 2011 లో గ్రూప్ 1 నిర్వహిస్తే… తెలంగాణ ఏర్పాటైన తర్వాత 10 ఏళ్లుగా గత ప్రభుత్వం గ్రూప్ -1 నిర్వహించాలన్న ఆలోచన చేయలేదని విమర్శించారు. ఏ ఆకాంక్ష కోసం తెలంగాణ ఏర్పాటు చేసుకున్నామో, గడిచిన పదేండ్లలో ఆ ఆకాంక్ష నెరవేరలేదని మండిపడ్డారు. ఎంతో మంది ప్రాణ త్యాగం వల్ల సాధించిన తెలంగాణ ఒక కుటుంబ ప్రయోజనం కోసం కాదని అన్నారు. గతంలో ప్రశ్నాపత్రాలు పల్లీబఠాణీలుగా జిరాక్స్ సెంటర్లలో లభించే విధంగా పోటీ పరీక్షలను అపహాస్యం చేశారని విమర్శించారు.

telangana cm revanth reddy handed over appointment orders to group 1 selected candidates 3
telangana cm revanth reddy handed over appointment orders to group 1 selected candidates (3)

తమ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను యూపీఎస్సీ కన్నా ఉన్నతంగా ఉంచాలని కమిషన్‌ను ప్రక్షాళన చేశామని తెలిపారు. అది నచ్చని కొంతమంది కడుపుమంటతో ఉద్యోగాలను అమ్ముకున్నారని అపవాదు వేశారని… కానీ తాను, మంత్రివర్గ సహచరులం మంచి చేయాలన్న ఒక సంకల్పంతో పనిచేశామని చెప్పారు. డిసెంబర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సమయంలో కూడా అంత ఆందోళన చెందలేదని… కానీ గ్రూప్-1 అంశంలో ఆందోళన చెందానని… ఒక మంచి సంకల్పంతో పని చేసినప్పుడు లక్ష్యం ముందుండాలి తప్ప మరొకటి కాదని పేర్కొన్నారు.



Source link

- Advertisement -

Top Selling Gadgets

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + 3 =

Share post:

Subscribe

Popular

More like this
Related

Top Selling Gadgets