Singer Kalpana Try to Die : హైదరాబాద్‌లో ప్రముఖ గాయని కల్పన ఆత్మహత్యాయత్నం చేసింది. నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డట్టు తెలుస్తోంది. వెంటనే ఆమెను స్థానికులు, పోలీసులు ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం కల్పన చికిత్స పొందుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే,
వెంటిలేటర్‌పై చికిత్స : కల్పన నిజాంపేటలోని వర్టెక్స్ ప్రీ వీలేజ్ గేటెడ్ కమ్యూనిటీలో ఉంటున్నారు. 2 రోజులుగా వారి ఇంటి గేట్లు తెరుచుకోకపోవడంతో అనుమానం సెక్యూరిటీకి వచ్చింది. దీంతో అసోసియేషన్‌కు సమాచారం ఇచ్చారు. అసోసియేషన్ సభ్యులు కల్పనతో మాట్లాడేందుకు కాల్ చేయగా స్పందించలేదు. దీంతో కల్పన భర్తకు కాల్ చేసి విషయం చెప్పారు. ఆయన కూడా కల్పనతో మాట్లాడేందుకు ప్రయత్నించాడు. కానీ ఫలితం లేదు. అసోసియేషన్ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి అచేతన స్థితిలో ఉన్న కల్పనను సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కల్పన భర్త చెన్నై నుంచి హాస్పిటల్‌కు చేరుకున్నారు. సింగర్ సునీత, శ్రీ కృష్ణ ఆసుపత్రికి వచ్చి కల్పన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
కల్పన తెలుగులో చాలా పాటలు పాడారు. ఆమె పాడిన పాటల్లో చిరంజీవి నటించిన ఇంద్ర సినిమాలోని ‘అమ్మడు అప్పచ్చీ నువ్వంటేనే పిచ్చి’, రవితేజ నటించిన వెంకీ సినిమాలోని ‘హే గోంగూర తోట కాడ కాపు కాషా’, పాటలు బాగా పాపులర్ అయ్యాయి.



